రచయితగా పనిచేసిన చాలా మంది దర్శకులుగా మారుతుంటారు. రచయితగా వచ్చే పాపులారిటీ కన్నా దర్శకుడిగా వచ్చే పాపులారిటీ ఎక్కువగా ఉంటుంది.  అంతేకాదు సంపాదన విషయంలో దర్శకుడే ముందుంటాడు. అందుకే రచయితలందరూ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దర్శకుడిగా మారాలని అనుకుంటారు. అయితే రచయిత నుండి దర్శకులుగా మారిన వారందరూ సక్సెస్ అవలేరు. అలా సక్సెస్ కాని వారిలో బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ గారు కూడా ఒకరు.

 

 

రాజమౌళి తండ్రిగారైన విజయేంద్ర్ ప్రసాద్ రాజమౌళి తెరకెక్కించిన అన్ని సినిమాలకి కథ అందించాడు. బాహుబలితో పాటు ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఆర్.ఆర్.ఆర్ కి కూడా విజయేంద్రప్రసాదే కథ అందించాడు. ఒక్క తెలుగులోనే కాదు తమిళంలో మెర్సల్, హిందీలో భజరంగీ భాయ్ జాన్ సినిమాలకి కథ అందించి సూపర్ పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం రచయితగా సూపర్ సక్సెస్ గా ఉన్న విజయేంద్రప్రసాద్ మెగా ఫోన్ పట్టబోతున్నాడు.

 

 

అర్థాంగి సినిమాతో మొదటి సారి మెగాఫోన్ పట్టిన విజయేంద్రప్రసాద్ ని అపజయం పలకరించింది. ఆ తర్వాత మళ్ళీ శ్రీ క్రిష్ణ ౨౦౦౬ తీశాడు. అది కూడా ఫెయిల్యూర్ అయింది. ఆ తర్వాత రాజన్న ఫర్వాలేదనిపించినా, మళ్ళీ శ్రీవల్లి సినిమాతో దర్శకుడిగా చతికిల పడ్డాడు. అయితే తాజాగా మరోమారు దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే కథ కూడా పూర్తయిందట. 

 

 

ఓ యంగ్ హీరోతో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారట. లాక్డౌన్ పూర్తయ్యాక ఈ సినిమాకి  సంబంధించిన పూర్తి వివరాలు బయటకి వెల్లడి చేస్తారట. మరి సక్సెస్ ఫుల్ రైటర్ గా కొనసాగుతున్న విజయేంద్ర ప్రసాద్ దర్శకుడిగా చేస్తున్న మరో ప్రయత్నంతోనైనా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథతో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తలైవి చిత్ర కథని కూడా విజయేంద్రప్రసాదే అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: