మన భారతదేశంలో చాలా మందికి మతాల పిచ్చి బాబాల పిచ్చి చాలా వరకు ఉంటుంది. వాళ్ళు ఏది చెప్తే అది పాటిస్తూ ఎవరిని అయినా సరే ఇబ్బంది పెడుతూ ఉంటారు. బాబాలు స్వామీజీల కోసం దేన్ని అయినా సరే వదులుకుంటూ ఉంటారు. ఒక రంగంలో పైకి రావాలి అంటే కచ్చితంగా బాబాల పిచ్చి ఎక్కువగా ఉంటుంది. ఇక వారు లేనిదే వారి సలహాలు లేనిదే ఏ పని కూడా ముందుకు తీసుకుని వెళ్ళే సాహసం చేయరు. దేశంలో చాలా మంది ప్రముఖులకు ఇదే పిచ్చి ఉంది. తాము పైకి రావడానికి ఇదే ఉపయోగపడింది అని అంటూ ఉంటారు. 

 

ఇక ఎన్టీఆర్ విషయంలో మాత్రం అలా ఉండేది కాదని అంటున్నారు. ఎన్టీఆర్ సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా సరే బాబాలను ఎప్పుడు కూడా నమ్మలేదు అని చెప్పవచ్చు. ఆయన అసలు వారిని దగ్గరకు కూడా రానీయలేదు అని కమ్యునిస్ట్ భావాలు ఆయనలో ఎక్కువగా ఉండేవి అని అంటూ ఉంటారు రాజకీయాల్లో ఆయన కష్టాలు పడినా సరే ఎవరిని కూడా దగ్గరకు రానిచ్చే వారు కాదని అంటారు. సినిమాల్లో ఉన్న సమయంలో అయినా సరే ఆయన ఎవరిని కూడా దగ్గరకు తీసుకుని పూజలు చేయించిన సందర్భం అనేది లేదు అని చెప్తూ ఉంటారు 

 

కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఆయన అదే విధంగా వ్యవహరించారు అని అంటూ ఉంటారు. కుటుంబ సభ్యులు ఎవరూ కూడా బాబాల చుట్టూ తిరగవద్దు అని ఎన్టీఆర్ చెప్పే వారు అని అంటారు. అందుకే ఇప్పటికి కూడా నందమూరి కుటుంబం భక్తి ఉంటే గుడికి వెళ్ళడమే గాని ఎవరిని కూడా ప్రత్యేకంగా ఆదరించిన సందర్భం అనేది లేదు అని అంటారు. ప్రస్తుతం కూడా నందమూరి కుటుంబం లో ఎవరు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించిన సందర్భం లేదని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: