రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా సరే తెలుగు విషయానికి వస్తే కచ్చితంగా చెప్పే పేరు ఎన్టీఆర్ ఆయన పేరు లేకుండా సినిమా ఉండదు రాజకీయం ఉండదు, ప్రభుత్వం ఉండదు. ఆయన  నేడు బ్రతికి లేకపోయినా సరే ఆయన పేరు తలవని రాజకీయ నాయకుడు ఉండరు. ఎవరిని అయినా విమర్శించాలి అన్నా సరే ఆయన పేరుని కచ్చితంగా తలుస్తూ ఉంటారు. ఆయన రాజకీయాన్ని ఆయన సినిమాని కచ్చితంగా ప్రస్తావిస్తూనే ఉంటారు. ఇక ఆయన పేరు వింటే కొంత మందికి పూనకం వస్తుంది. పేద వారిలో ఆయన ఇప్పటికి కూడా దేవుడే అని అంటారు. 

 

ఏ రాజకీయ పార్టీ స్థాపించినా సరే ఆయన పేరు లేకుండా మాత్రం ఉండదు అనేది వాస్తవం. రాజకీయాల్లో అయితే ఆయన గురించి చెప్పుకొని రోజు అంటూ ఉండదు. ఏదోక ఒక పార్టీ ఆయన పేరు మీద హామీలు ఇవ్వడమో లేక ఆయన గురించి ప్రస్తావి౦చడమో చేస్తూ ఉంటుంది. ఇక ఇది పక్కన పెడితే ఆయన పేరు మీద ఒక స్టాంప్ కూడా విడుదల చేసింది ఏపీ సర్కార్. ఎన్టీఆర్ పేరిట సినిమా ప్రముఖులకు జీవిత కాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1996 లో నెలకొల్పింది. 

 

2002 వరకు ఇస్తూ వచ్చిన ఈ అవార్డును ప్రభుత్వం తరువాత నిలిపివేసింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 2006 జనవరి 18 న ఈ పురస్కారాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు హయాంలో టీడీపీ సర్కార్ మొదలుపెట్టి ఆ తర్వాత నిలిపివేసింది. అప్పుడు దీనిపై విమర్శలు కూడా ఎక్కువగానే వచ్చేవి అప్పట్లో. ఇక తెలుగుదేశం కార్యకర్తల ను దగ్గర చేసుకోవడానికి గానూ వైఎస్ ఆ విషయం లో ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: