ఎన్టీఆర్... సొంత జిల్లా కృష్ణా జిల్లా. ఆయనకు ఆ జిల్లాతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పుట్టి పెరిగిన జిల్లా అదే. ఆయనకు రాజకీయ ఓనమాలు కాకపోయినా సినిమా ఓనమాలు దిద్దిన జిల్లా అదే. ఆయన అక్కడి నుంచే జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగారు. ఆయన పేరు వింటే చాలు పూనకం వచ్చే స్థాయిలోకి జనాలను తీసుకుని వెళ్ళారు ఎన్టీఆర్. ఆయన జీవితంలో ఎక్కువగా కృష్ణా జిల్లాతో అనుభంధం ఉన్నా సరే ఆయన ఎక్కువగా ప్రేమించింది మాత్రం హైదరాబాద్ ని అంటూ ఉంటారు. 

 

హైదరాబాద్ తో ఆయనకు ఎక్కువ అనుబంధం ఉందని చెప్తూ ఉంటారు. ఆయన రాజకీయ పార్టీని స్థాపించింది, సినిమాలను చేసింది కూడా అక్కడే కాబట్టి ఆయన అక్కడే ఎక్కువగా ఉండే వారు. ఇక ఆయన హైదరాబాద్ ని తెలుగువారికి గర్వకారణం చెప్తూ ఉంటారని అంటూ ఉంటారు. తెలుగు వారికి హైదరాబాద్ అనేది ఒక చిరస్థాయి నగరంగా ఉండాలి అనేది ఎన్టీఆర్ ఆకాంక్ష అని అంటారు. ఆయన అందుకే చెన్నై నుంచి సినీ పరిశ్రమను హైదాబాద్ తీసుకొచ్చే వరకు కూడా ఊపిరి సలపకుండా పోరాటం చేసారని అప్పుడు అందరికి నచ్చజెప్పి ఆయన తీసుకొచ్చారని అంటారు. 

 

ఆయన రాజకీయ జీవితంలో ఆయినా సరే ఆయన కృష్ణ జిల్లా కంటే ఎక్కువగా హైదరాబాద్ కే ప్రాధాన్యత ఇచ్చారు అని అంటున్నారు. ఆయన ఎక్కడ ఉన్నా సరే హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా ఆలోచించే వారు అని హైదరాబాద్ లో మత ఘర్షణలు ఏ విధంగా ఉండకూడదు అని ఆయన చాలా మందితో చెప్పే వారు అని హైదరాబాద్ ని చాలా గర్వకారణం గా ప్రతీ ఒక్క తెలుగు వాడు భావించాలి అని ఆయన భావించి అందుకోసం కష్టపడ్డారు అని అంటారు. విజయవాడ ఆయన సొంత నగరం అయనా సరే హైదరాబాద్ నే ప్రేమించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: