శోభన్ బాబు... మన తెలుగులో ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న నటుడిగా జీవితం మొదలు పెట్టి అమ్మాయిలకు సోగ్గాడిగా ఆయన నిలిచిపోయారు. ఆయన సినిమాలు అనగానే చాలా మందికి ఇప్పటికి కూడా ఒక పిచ్చి అనేది ఉంది. ఆయన సినిమాల కోసం పనులు మానుకుని చూసిన మహిళా ప్రేక్షకులు కూడా ఉన్నారు అని అంటూ ఉంటారు. ఆయన సినిమాలు ప్రతీ ఒక్కటి కూడా ప్రేక్షకులకు చాలా వరకు దగ్గరయ్యాయి. ఇక ఆయన సినిమాల్లోకి రావడానికి ఆ విధంగా సూపర్ స్టార్ అవ్వడానికి ప్రధాన కారణం ఎన్టీఆర్ అని అంటారు. 

 

అవును ఆయనను అన్ని విధాలుగా పైకి తీసుకొచ్చింది ఎన్టీఆర్ అనేది చాలా మంది చెప్పే మాట. ఆయనలో ఉన్న ప్రతిభ ను గుర్తించిన శోభన్ బాబు ఆయనను స్టార్ హీరో ని చేసారు అని అంటారు. ఈ విషయాలను శోభన్ బాబు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు కూడా. ఆయన అనగానే ఎన్టీఆర్ కి ఒక ప్రత్యేక అభిమానం అని అందుకే శోభన్ బాబు కి కష్టాల్లో ఉన్న సమయంలో కూడా ఎన్టీఆర్ అన్ని విధాలుగా అండగా నిలిచే వారు అని ఆయన వ్యక్తిగత జీవితంలో ఇబ్బంది పడిన సందర్భంలో  ఎన్టీఆర్ సహాయం చేసారు అని అంటూ ఉంటారు. 

 

ఆ విధంగా శోభన్ బాబు ని ఒక కొడుకు మాదిరిగా ఎన్టీఆర్ చూసారు అని అంటారు.  చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ ఆయనకు అండగా ఉన్నారు అని తన ఇంట్లో కూడా శోభన్ బాబు కి చాలా వరకు స్వేచ్చ ఇచ్చే వారు అని చెప్తూ ఉంటారు. ఎన్నో సలహాలు కూడా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇచ్చారు అనేది టాలీవుడ్ జనాల మాట. రాజకీయాల్లోకి వచ్చాక కూడా శోభన్ బాబు ని ఎన్టీఆర్ ఎప్పుడు కూడా మర్చిపోలేదు అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: