కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో లాక్ డౌన్ తో అన్ని రంగాలు మూతపడ్డాయి. ఇక సినీ రంగం కూడా పూర్తిగా మూత పడింది. ఇది ఇలా ఉండగా తాజాగా జూన్ నెలలో షూటింగ్ లో మళ్లీ మొదలు అవ్వ బోతున్నాయి అని ఒక శుభవార్త తెలియజేశారు. అదేవిధంగా ఆగస్టు నెలలో థియేటర్లు తెరిచేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఇలా అన్నీ జరిగినా కూడా ప్రేక్షకులను థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తారా...? ఇంత ముందుకు లాగా థియేటర్లు కళకళలాడుతాయి అన్న సందేహం అందరిలోనూ ఏర్పడింది...


ఇక తెలుగు ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగ సందర్భంలో బాక్సాఫీస్ దగ్గర బాగా హిట్లు సొంతం చేసుకున్నాయి. అలా వైకుంఠపురంలో,  సరిలేరు నీకెవ్వరు సినిమాలు. కానీ ఆ తర్వాత నుంచి కరోనాతో ఎవరూ ఊహించలేని పెద్ద దెబ్బ పడింది. ఇప్పటికి రెండు నెలలకు పైగా అవుతున్నా కూడా థియేటర్లు షూటింగ్ లు ఇంకా మొదలవ్వాలి పరిస్థితి ఏర్పడింది. దీనితో ఇండస్ట్రీకి వందల కోట్ల వ్యాపారం ఆగిపోయిందనే చెప్పాలి. అంతేకాకుండా తెలుగు ఇండస్ట్రీలో దాదాపు యాభై వేలకు మంది పైగా ఉపాధి కూడా కోల్పోయారు.


ఇక ఏ ఇండస్ట్రీలో అయినా కూడా వ్యాపారమే ఒక కీలక అంశం. దీన్నిబట్టే పరిశ్రమ ముందుకు కొనసాగుతుంది. మరి ఈ పరిస్థితులలో సినీ వ్యాపారం ఎలా ఉండబోతుంది అన్నది డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు పై ఆధారపడి ఉంటుంది అని అర్థమవుతుంది. ఇలా ఉండగా మరోవైపు అతి పెద్ద స్థాయిలో రూపుదిద్దుకున్న సినిమాల పరిస్థితి ఏమిటి అన్న విషయానికి వస్తే... వాస్తవానికి ఈ సంవత్సరం పెద్ద హీరోల చిత్రాలు రిలీజ్ ఇప్పట్లో జరిగే లాగా లేవు. కరోనా దెబ్బతో అన్ని సినిమాలు కూడా రిలీజ్ చేసేందుకు రీషెడ్యూల్ చేశారు. వాస్తవానికి ఈ సంవత్సరం దసరా కు రావలసిన ఆచార్య, కేజిఎఫ్ 2 సినిమాలు వచ్చే సంవత్సరం సంక్రాంతికి.. అలాగే ప్రతిష్టాత్మక చిత్రం అయిన ఆర్.ఆర్.ఆర్ సినిమా వేసవి సెలవుల్లో రిలీజ్ చేసేందుకు రీషెడ్యూల్ చేయవచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కానీ ఈ సంవత్సరం వ్యాపారపరంగా తెలుగు ఇండస్ట్రీలో బాగా దెబ్బ పడిందనే చెప్పాలి. ఒకవేళ అన్నీ బాగుండి థియేటర్లలో సినిమాలు విడుదలైన కూడా వచ్చి చూస్తారా అన్న సందేహం  అందరిలోనూ ఉండిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: