మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసిన పవన్ కల్యాణ్ పవర్ స్టార్ గా ఎదిగిన తెలుగు ఇండస్ట్రీలోని అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా ఎదిగాడు. తన సినీ కెరీర్ సాఫీగా సాగిపోయింది కానీ తన రియల్ లైఫ్ మాత్రం అంత మంచిగా కొనసాగలేనని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తన రెండు వివాహలు ఫెయిల్ అవ్వడం గురించి చాలామంది ప్రస్తావిస్తుంటారు. 1971 సెప్టెంబర్ 2వ తేదీన బాపట్లలో కొణిదెల వెంకటరావు అంజనా దేవిలకు జన్మించాడు పవన్ కళ్యాణ్. ఇతనికి ఇద్దరు అక్కలు ఇద్దరు అన్నయ్యలు కాగా వారిలో చిరంజీవి గొప్ప నటిగా పేరు తెచ్చుకుంటే... చిన్న అన్నయ్య నాగబాబు మాత్రం టీవీ షోలలో రాణిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే చిరంజీవి తెలుగు పరిశ్రమలో పెద్ద స్టార్ హీరోగా ఎదిగాడు. అప్పట్లో చిరంజీవికి బ్రహ్మరథం పట్టడంతో కమిటీ కూడా ఆ పాపులారిటీ రావాలనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ సినిమాలపై ఆసక్తి చూపాడు. నా ఇంటర్మీడియట్ చదివాను నెల్లూరు వి ఆర్ సి కళాశాలలో పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత డిప్లొమా కంప్యూటర్ కోర్సు పూర్తిచేశాడు. 


1997 మే నెలలో విశాఖపట్నానికి చెందిన నందినితో పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్నాడు. కానీ వారి వైవాహిక బంధం ఎంతో కాలం సాగలేదు. తీవ్రమైన మనస్పర్ధలు రావడంతో నందిని పవన్ కళ్యాణ్ కి విడాకులు ఇవ్వాలనుకుంది. బద్రి సినిమాలో తనతో పాటు నటించిన రేణుదేశాయ్ తో పవన్ కళ్యాణ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని... వాళ్ళిద్దరికీ ఒక కొడుకు కూడా పుట్టాడని 2007 వ సంవత్సరం జులై నెలలో నందిని న్యాయస్థానంలో కేసు వేసింది. అది చాలదన్నట్టు ఆమె 14 మంది చిరంజీవి కుటుంబ సభ్యులపై కూడా అనేకమైన ఆరోపణలు చేసింది. 


అయితే ఈ పిటిషన్ను కోర్టు కొట్టివేయగా... ఆమె ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా... ఆమె పిటిషన్ పై స్టే లభించింది. తదనంతరం పవన్ కళ్యాణ్ కూడా నందిని నుండి విడాకులు కావాలని కోరాడు. అయితే దానికి బదులుగా నెలకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా నందిని రెడ్డి కోరింది. తను వేసిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవడానికి పవన్ కళ్యాణ్ నుండి రూ. 5కోట్లకు పుచ్చుకుంది నందిని. తదనంతరం విశాఖపట్నంలోని ఫ్యామిలీ కోర్టు వీళ్ళిద్దరికీ 2008వ సంవత్సరంలో విడాకులను మంజూరు చేసింది. ప్రజారాజ్యం పార్టీకి పవన్ కళ్యాణ్ అక్రమ సంబంధం ఎక్కడ అడ్డు వస్తుందోననే భయంతో చిరంజీవి... పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ లకు పెళ్లి చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: