సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు జయంతి మే 28వ తారీకు. అయితే ప్రతిసారి ఆ రోజున ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి ఆయనకు నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేదని చెప్పవచ్చు. దీనికి కారణం కరోనా వైరస్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల అనేక నిబంధనలు కొనసాగుతున్న సంగతి ప్రజలకు విధితమే...


ఇక అసలు విషయంలోకి వెళితే... ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్ళకూడదని జూనియర్ ఎన్టీఆర్, తన అన్న అయిన కళ్యాణ్ రామ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మామూలుగా ప్రతి సంవత్సరం మే 28 వ తారీఖున ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు అనేకమంది అభిమానులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని ఆయనకు ఘన నివాళులు తెలిపేవారు. ఇకపోతే ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా సీనియర్ ఎన్టీఆర్ మనవళ్లు ఆయన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ గురువారం నాడు ఎన్టీఆర్ ఘాట్కు వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ వారు అక్కడికి చేరుకుంటే పెద్దఎత్తున జనాలు గుమిగూడితే అటువంటి చోట కరోనా వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉండడంతో వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.


ఇకపోతే ఈ విషయంలో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ వారి ఇంట్లోనే ఉంటూ ఆ మహానుభావునికి నివాళులు ఇస్తున్నట్లు వారు తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఆ తర్వాత మాటల మాంత్రికుడు దర్శకుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నిజానికి ఆంధ్రుల ముద్దుబిడ్డ అయిన నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించడానికి కూడా ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా బాధపడాల్సిన విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: