టాలీవుడ్ లో ఇప్పుడు మన స్టార్ హీరోలు వ్యాపారం మీద ఎక్కువగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అగ్ర హీరోలు అందరూ  కూడా వ్యాపారాల్లో మంచి లాభం ఉన్న నేపధ్యంలో వాళ్ళు ఎక్కువగా వ్యాపారాల మీద ఫోకస్ చేసి పెట్టుబడులు పెడుతున్నారు ఇక ఇప్పుడు  ప్రభాస్ ఒక పెద్ద వ్యాపారంలోకి దిగుతున్నాడు అని సమాచారం. అతను ఇప్పుడు  ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న తన సన్నిహితుల ద్వారా కొన్ని సీరియల్స్ ని నిర్మించే యోచనలో ఉన్నాడని సమాచారం. తన భార్యకు సీరియల్స్ ని నిర్మించాలి అనే కోరిక ఉందని అందుకే ఆమె కోరిక కాదు అనలేక అతను అక్కడ సీరియల్స్ లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని సమాచారం. 

 

అక్కడ సినిమాలు అయితే దేశ వ్యాప్తంగా ఆడే అవకాశం ఉందని అందుకే ఇప్పుడు అక్కడి సీరియల్స్ సినిమాల మీద అతను ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. మరి ముందు ఏ సినిమా చేస్తాడు అనేది చూడాలి. ఇప్పుడు టాలీవుడ్ లో అతను చాలా బిజీ గా ఉన్నాడు అయినా సరే అక్కడ పెట్టుబడి పెట్టడానికి అతను ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అతను త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. 

 

సినిమా వచ్చే ఏడాది రానుంది. ఆ సినిమా కథలో కొన్ని మార్పులు ఉన్న నేపధ్యంలో ఎన్టీఆర్ మార్పులు చెప్పాడు అని ఆ మార్పులను త్రివిక్రమ్ చేస్తున్నాడు అని అన్నీ సిద్దం అనుకుంటే ముందు ఎన్టీఆర్ లేకపోయినా సరే సినిమా షూటింగ్ ని మొదలుపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమా తర్వాత అతను బాలీవుడ్ లో ఒక సినిమా చేసే అవకాశం ఉందని సమాచారం. బన్సాలి దర్శకత్వంలో సినిమా చేస్తాడు ఎన్టీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: