తక్కువ కాలంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో నానీ. అతని సినిమాలు అనగానే ప్రేక్షకులకు ఒక క్రేజ్ ఉంటుంది. అన్ని వర్గాల అభిమానులు కూడా అతని సినిమాలను ఆదరించిన పరిస్థితి మనం చూసాం. అతని సినిమాలు చాలా వరకు మంచి విజయాలను సాధించాయి. ఇక ఇప్పుడు అతను లాక్ డౌన్ లో చాలా ఖాళీ గా ఉన్నాడు. అతను చేసే మూడు సినిమాలు కూడా లాక్ డౌన్ లో  షూటింగ్ లేక ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అతను భవిష్యత్తు సినిమాల మీద దృష్టి పెట్టినట్టు సమాచారం. భవిష్యత్తు లో మంచి సినిమాలను చేయడానికి అతను ప్రయత్నాలు చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

నానీ ఇప్పుడు ఒక సినిమాను  లాక్ డౌన్ లో చేయడానికి సిద్దమైనట్టు సమాచారం. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి జీవితం లాక్ డౌన్ లో ఎంత దారుణంగా ఉంది అనేది అతను తన సినిమాలో చూపించే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు తానే దర్శకుడు అని తన ఇంట్లో నే తాను ఈ సినిమాను చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాను అతను మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు ఓటీటీ ఫ్లాట్ ఫాం లో తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. అతను ఇప్పుడు ఒక కథను దీని కోసం సిద్దం చేసినట్టు టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. 

 

ఆ కథను తనకు సన్నిహితంగా ఉండే ఒక దర్శకుడు నానీ కి ఇచ్చాడు అని సమాచారం. ఇక ఇదిలా ఉంటే నానీ ఇప్పుడు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. తన సినిమాలకు మార్కీ ఉండటం తో అతను ఇప్పుడు తన సినిమాలను తానే నిర్మించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఏ సినిమా చేస్తాడో అలా..

మరింత సమాచారం తెలుసుకోండి: