టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను సినిమాలు అనగానే కొందరికి ఒక రకంగా పండగ వాతావరణం ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా కనపడుతుంది. అతను ఇప్పుడు కొన్ని కథలను కూడా విని లైన్ లో పెట్టుకున్నాడు. జక్కన్న సినిమా తర్వాత అతను త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తాడు ఈ సినిమా తర్వాత అతను కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటున్నాడు అని ప్రచారం జరుగుతుంది. 

 

అతను వచ్చే ఏడాది మొత్తం గ్యాప్ లోనే ఉంటాడు అని 2022 అతని చేతిలో చేసే సినిమాలు చాలానే ఉన్నాయని కాకపోతే అప్పుడు అతని చేతిలో భారీ ప్రాజెక్ట్ ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆ కథను అతను ఇప్పటికే విన్నాడు అని మరో స్టార్ హీరో తో కలిసి అతను ఆ సినిమా చేసే అవకాశం ఉందని అయితే ఆ సినిమాకు నిర్మాతగా కూడా అతనే ఉండే అవకాశం ఉందని సమాచారం. దానికి సంబంధించి వచ్చే ఏడాది స్పష్టత వచ్చే సూచనలు ఉన్నాయని తెలుస్తుంది. త్రివిక్రమ్  కి కూడా అతను సినిమా వేగంగా చెయ్యాలని చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి సినిమాను ఎప్పుడు పూర్తి చేస్తారో చూడాలి. 

 

అతను ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో చేస్తున్నాడు ఈ సినిమా వచ్చే ఏడాది రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేసే అవకాశం ఉందని అందుకే ఆలస్యం అయ్యే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిజం ఎంత అనేది తెలియదు గాని ఈ సినిమా మాత్రం కచ్చితంగా వాయిదా పడే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: