ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ లకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే తక్కువ ధరకు సినిమాలను చేసే హీరోయిన్ లను మాత్రమే సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు తీసుకుంటున్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. హీరోయిన్ ల విషయంలో ఇప్పుడు కొందరు నిర్మాతలు భయపడుతున్నారు అని వారికి అంతగా ఖర్చు వద్దు అనే భావన లో ఉన్నారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. అగ్ర హీరోలు చాలా మంది తమకు స్టార్ హీరోయిన్ అవసరం లేదని తాము ఏ విధంగా అయినా సరే సినిమా చేస్తామని చెప్తున్నట్టు సమాచారం. 

 

ఇక ఈ తరుణంలోనే నిర్నాతలు కొందరు బాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న చిన్న చిన్న హీరోయిన్ లకు తెలుగులో అవకాశాలు ఇవ్వాలి అని ప్రయత్నాలు చేస్తున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ లో కొందరు హీరోయిన్ లు అవకాశాల కోసం కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ముంబై కి చెందిన హీరోయిన్ లు ఒక ఇద్దరు ఉన్నారు. వారు ఇప్పుడు ఇక్కడ అవకాశాలు వస్తే చాలు అనుకున్నా కుదరక అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్లకు తక్కువ పారితోషికం ఇచ్చి తీసుకొచ్చే ప్రయత్నాలను చేస్తున్నట్టు సమాచారం. 

 

వారు అంగీకరిస్తే వారిని సినిమాల్లోకి తీసుకోవాలని అగ్ర హీరోల సినిమాల్లో వారికి అవకాశాలు ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు టాలీవుడ్ లో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. రామ్ చరణ్ కూడా తన సినిమాలో స్టార్ హీరోయిన్ ఏమీ అవసరం లేదని డిమాండ్ ఎక్కువ చేస్తే కొత్త వారిని తీసుకోవచ్చు అని ఆయన చెప్పారట. తన పారితోషికం కూడా తగ్గించుకుంటా అని రామ్ చరణ్ నిర్మాతల కు చెప్పినట్టు సమాచారం. తన గురించి ఏ ఇబ్బంది పడవద్దు అని అతను వారికి చెప్పినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: