శర్వానంద్.. ఏ హడావుడి లేకుండా చాలా సైలెంట్ గా సినిమాలు చేసుకునే ఒక హీరో. అతని సినిమాలు అనగానే ప్రేక్షకులకు ముందు నుంచి ఏదో తెలియని హుషారు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే శర్వా మాత్రం ఫ్లాప్ అయ్యే అవకాశం ఉండదు అని అతని అభిమానులు చెప్తూ ఉంటారు. అతనికి అదే ప్లస్ గా మారింది. అయితే రెండు మూడేళ్ళు గా అతను చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఏ సినిమాలు చెయ్యాలో అర్ధం కాక నానా కష్టాలు పడుతున్నాడు శర్వా. అతని సినిమా కథలు కూడా ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. 

 

సమంతా తో అతను చేసిన సినిమా మంచి విజయ౦ సాధిస్తుంది అని భావించినా సరే అతనికి షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా తర్వాత అతను రామ్ చరణ్ సినిమాలో కనపడే అవకాశం ఉందని సమాచారం. రామ్ చరణ్ సినిమాలో అతను తమ్ముడుగా నటించే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. శర్వా పరిస్థితిని చూసిన రామ్ చరణ్ సినిమా చేయమని అడిగాడు అని దానికి శర్వానంద్ కూడా ఓకే చెప్పాడు అని సమాచారం. ఆ సినిమాలో రామ్ చరణ్ కి తమ్ముడిగా అతను నటిస్తున్నాడు అని సమాచారం. 

 

సినిమా వచ్చే ఏడాది మొదలు కానుంది. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఎలా అయినా సరే సినిమాను విడుదల చేయడానికి సంక్రాంతికి ప్రయత్నాలు చేద్దామని చూసినా సరే అది సాధ్యం కాలేదు. దీనితో ఇప్పుడు ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను మళ్ళీ రీ షూట్ చేసి లేట్ అయినా పర్వాలేదు గాని సినిమాను బాగా ఇవ్వాలని భావిస్తున్నారని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: