దేశ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇక ఎప్పుడు షూటింగులతో బిజీగా ఉండే సినీ సెలబ్రెటీలు అయితే అనుకోకుండా వచ్చిన హాలిడేస్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. కాకపోతే గత రెండు నెలలుగా సినిమా షూటింగులు లేకపోవడంతో ఇంట్లోనే ఉంటూ బోర్ గా ఫీల్ అవుతున్న వారు కూడా ఉన్నారు. కొంతమంది మాత్రం దొరికిన ఈ సమయాన్ని వర్కౌట్స్ వీడియోలతో టిక్ టాక్ వీడియోలతో టైం పాస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో కార్తికేయ తన బాడీ ఫిట్ నెస్ మీద ఫోకస్ పెట్టాడు. ఇప్పుడు తాజాగా సిక్స్ ప్యాక్ లుక్ తో కేక పుట్టిస్తున్నాడు. చొక్కాలేకుండా తన బాడీని చూపిస్తూ అమ్మాయిల గుండెల్లో గుబులు రేపుతున్నాడు. ''లాక్ డౌన్ మా ప్రణాళికలను మార్చింది.. కానీ ఇది మా లక్ష్యాలను ప్రభావితం చేయదు'' అంటూ తన సిక్స్ ప్యాక్ ఫోటోలను పోస్ట్ చేసాడు. ఇప్పుడు కార్తికేయ బేర్ బాడీతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

 

ఇదిలా ఉండగా కార్తికేయ సొంత ప్రొడక్షన్ లో 'ప్రేమతో మీ కార్తీక్' అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కానీ ఈ సినిమా ఉన్నట్లు కూడా చాలా మందికి తెలియదు. ఆ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన rx 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. దీంతో మ‌నోడు మాస్ ఇమేజ్ అంటూ ఆ త‌రువాత ట్రై చేసిన 'గుణ 369' 'హిప్పీ' సినిమాలు వ‌రుస‌పెట్టి ఫ్లాప్స్ అయిన విషయం తెలిసిందే. వెంటనే నాని హీరోగా నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి అలరించాడు. ఆ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకొని తీసిన '90 ఎమ్.ఎల్' కూడా దారుణంగా ఫ్లాప్ అయింది. కార్తికేయ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్ లో 'చావు క‌బురు చ‌ల్ల‌గా' అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన షూటింగ్ ఆగిపోయింది. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: