పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బొమ్మ పడితే మెగా ఫ్యాన్స్ అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ చేసే హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. పవర్ స్టార్ సినిమా డిజాస్టర్ అయినా కూడా మొదటి రెండు రోజులు కలక్షన్స్ రికార్డులు బ్రేక్ చేస్తాయి. టాలీవుడ్ లోనే కాదు సౌత్ లో హ్యుజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో పవన్ కళ్యాణ్ ఒకరు. అజ్ఞాతవాసి తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆ సినిమా తర్వాత క్రిష్ డైరక్షన్ లో ఓ సినిమా ప్లాన్ చేశాడు. 

 

ఆ సినిమాకు ముహూర్త కార్యక్రమాలు పూర్తి కాగా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది. పిరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని అంటున్నారు. అదే జరిగితే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అని చెప్పొచ్చు. పవన్ ఒక్కడుంటేనే బాక్సులు బద్దలు కొడతాయి అదే ఇద్దరైతే రికార్డులు తిరగరాయడం కామన్. పవర్ స్టార్ సినిమా అనగానే ఫ్యాన్స్ లో ఉత్సాహం మొదలవుతుంది. వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపిస్తున్నాడు. ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సినిమా కాబట్టి తెలుగులో కూడా వకీల్ సాబ్ హిట్ పక్కా అంటున్నారు.


 
ఇక క్రిష్ చేస్తున్న సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత క్రిష్ పవన్ తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు క్రిష్. ఈ సినిమాను సూర్య మూవీస్ బ్యానర్ లో ఏ.ఎం రత్నం నిర్మిస్తారని టాక్. కేవలం తెలుగులోనే కాదు ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. మొత్తానికి పవన్ కళ్యాణ్ క్రిష్ మరో సంచలనానికి సిద్ధం అవుతున్నారని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: