పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమా చేస్తున్న తరుణంలో మెగా అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇదే సమయంలో ‘వకీల్ సాబ్’ సినిమా పూర్తవక ముందే డైరెక్టర్ క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా సినిమాలు పవన్ ఓకే అయ్యాయిచేయడం జరిగింది. కాగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మొగలుల కాలంలో ఒక వజ్రానికి సంబంధించిన స్టోరీ అన్నట్లు సినిమా లో పవన్ 'రాబిన్ హుడ్ టైపు' లో వేషధారణ ఉన్నట్లు ఇప్పటికే అనేక వార్తలు మనం విన్నాం. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో ఒక విషయం గురించి అభిమానులు తెగ డిస్కస్ చేస్తున్నారు. అదేమిటంటే సినిమాలో పవన్ కళ్యాణ్ సింగిల్ పాత్రలో నటిస్తున్నారా? లేకపోతే డబల్ ఫోజ్ లో నటిస్తున్నారా ? అని తెగ డిస్కషన్ చేసుకుంటున్నారు.

 

దానికి కారణం సినిమాలో పవన్ కళ్యాణ్ దొంగగా దోచుకునే క్యారెక్టర్ ఉంటుందని అదే రీతిలో పేదవారికి కూడా సాయం చేసే మంచివాడు క్యారెక్టర్ ఉంటుందని ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇటువంటి సమయంలో సినిమాలో పవన్ కళ్యాణ్ సింగిల్ క్యారెక్టర్ చేస్తున్నాడా లేకపోతే డబల్ క్యారెక్టర్ చేస్తున్నాడా పవన్ కళ్యాణ్ ఎటువైపు అడుగులు వేస్తున్నాడు అన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది.

 

అదే రీతిలో సినిమాలో అసలు సస్పెన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఐదు నిమిషాలకు ముందు బయటపడుతుందని సినిమాకి అదే హైలెట్ అని క్రిష్ దాన్ని బాగా డిజైన్ చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. లాక్ డౌన్ కారణంగా ఇండస్ట్రీలో సినిమా షూటింగ్ లేని ఆగిపోవటంతో ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. వకీల్ సాబ్ షూటింగ్ కూడా ఆగిపోయింది. కాగా జూన్ నెల నుండి సినిమా షూటింగులు మొదలయ్యే అవకాశం ఉండటంతో ముందుగా ‘వకీల్ సాబ్’ సినిమా పూర్తయ్యాకే క్రిష్ దర్శకత్వంలో పవన్ సినిమా స్టార్ట్ చేయనున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: