స్టార్ హీరో, స్టార్ డైరక్టర్ ఈ కాంబో ఎనౌన్స్ చేయడమే ఆలస్యం ఆ స్టార్ హీరోకి ఉన్న క్రియేటివ్ ఫ్యాన్స్ బాగా వర్క్ అవుట్ చేసి అదిరిపోయే స్టిల్స్ రిలీజ్ చేస్తారు. అవి చూసేందుకు అఫీషియల్ పోస్టర్స్ లానే ఉంటాయి. టైటిల్ రిలీజ్ కాకపొతే కనిపెట్టడం కష్టం కానీ అదే టైటిల్ రివీల్ చేసి ఫస్ట్ లుక్ ఆపితే మాత్రం అఫీషియల్ ఫస్ట్ లుక్ ను మించేలా రకరకాల ఫస్ట్ లుక్ పోస్టర్స్ వస్తాయి. లేటెస్ట్ గా అలాంటి అదిరిపోయే పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమౌళి డైరక్షన్ లో సూపర్ స్టార్ సినిమా అనగానే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 


ఇక ఈమధ్యలోనే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ కూడా వచ్చేశాయి. రాజమౌళి, మహేష్ కాంబోలో రామాయణం వస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ చూస్తే నిజంగా రాజమౌళి దగ్గర ఉంది చేయించాడా ఏంటి అనేలా ఉంది. నిన్నటి నుండి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్న ఈ పిక్ వాళ్ళిద్దరిని ఆలోచనలో పడేసింది చెప్పొచ్చు. అల్లు అరవింద్ రామాయణం సినిమా చేస్తానని ఎనౌన్స్ చేశాడు. దానికి డైరక్టర్ ఎవరన్నది ఇంకా చెప్పలేదు. 


రాజమౌళి డైరక్షన్ లో మహేష్ సినిమా ఉంటుందని అన్నారు. కాకపొతే వీళ్లిద్దరు కలిసి ఓ హాలీవుడ్ జేమ్స్ బాండ్ తరహా సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారు. కాకపొతే రామాయణం పోస్టర్ చూసి రాముడిగా మహేష్ ను రాజమౌళి మాత్రమే చూపించగలడు అనేలా ఉంది. రామాయణం ప్రేక్షకుడు మెచ్చేలా తీయడం అంటే అది రాజమౌళి వల్లే సాధ్యం. ఇక పోస్టర్ మార్ఫింగ్ అని తెలుస్తున్నా మహేష్ రాముడి లుక్ అదిరిపోయింది అన్న మాట చిన్నది అవుతుంది. మొత్తానికి ఇప్పుడు రాజమౌళి, మహేష్ కలిసి ఏ జానర్ సినిమా చేయాలన్న కాం ఫ్యూజన్ ఏర్పడేలా చేసింది ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: