రాశీఖన్నా.. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమాలో నాగశౌర్య సరసన మెరిసి తెలుగువారి హృదయాలను దోచుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతూ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. జై లవకుశ, తొలిప్రేమ, జిల్, శివమ్, బెంగాల్ టైగర్, సుప్రీమ్, హైపర్, రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు, శ్రీనివాస కళ్యాణం సినిమాల ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. వరుస అవకాశాలు వస్తూనే ఉండడానికి కారణం వ్యక్తిత్వమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఆమె ఇటీవల నటించిన 'వెంకీమామ' 'ప్రతిరోజూ పండగే' సినిమాలతో రెండు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంది. విజయ్ దేవరకొండతో నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫలితంతో ఓ భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది రాశీ. 

 

క‌రోనా వైర‌స్ కారణంగా ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు తమలోని టాలెంట్లన్నీ బయటకి తీస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళ అభిమానులతో పంచుకుంటున్నారు. కొంతమంది మాత్రం అనుకోకుండా కలసి వచ్చిన ఈ సమయాన్ని కొత్త కొత్త విషయాలను.. భాషలను నేర్చుకోడానికి ఉపయోగించుకుంటున్నారు. రాశీ ఖన్నా గత రెండు నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో పాటు పూర్తిగా ఇంటికే పరిమితం అవ్వడంతో ఇప్పుడు కొత్త భాష నేర్చుకుంటుంది. నార్త్ ఇండియన్ అయిన రాశీ ఖన్నా తెలుగులో అనర్గళంగా మాట్లాడే స్టేజికి వచ్చేసింది. రాశీకి ఇప్పుడు తెలుగులో కంటే పక్క ఇండస్ట్రీ తమిళ నాట ఎక్కువ అవకాశాలొస్తున్నాయి. అందువలన తమిళ్ నేర్చుకోవాలని డిసైడ్ అయింది. సోషల్ మీడియాలో ఈ విషయం గురించి రాశీ తెలియాజేస్తూ ''బ్యాక్ టూ స్కూల్..! అమేజింగ్ టీచర్ శ్రీమతి లీలాతో తమిళ మాట్లాడే స్కిల్స్ పెంచుకున్నాను. ఇప్పుడు నాకు క్లాస్ వర్క్ మరియు హోమ్ వర్క్.. క్లాస్ టెస్ట్ ఉన్నాయి !! ఈ లాక్‌ డౌన్‌ లో మీరు ఎలాంటి నిర్మాణాత్మక పనులు చేస్తున్నారు?'' అంటూ పోస్ట్ పెట్టింది. మొత్తం మీద కోలీవుడ్ లో వరుస ఆఫర్స్ కొట్టేస్తున్న రాశీ ఖన్నా పర్ఫెక్షన్ కోసం తమిళ్ నేర్చుకుంటోంది అంటూ నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: