ఇప్పుడు యాంకర్లు మన తెలుగులో ఒక రేంజ్ లో హడావుడి చేస్తున్నారు. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు ఈ మధ్య ఎక్కువగా చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొంద‌రు యాంక‌ర్ల సంపాద‌న మ‌న తెలుగు అగ్ర హీరోయిన్ల సంపాద‌న‌ను మించి పోయి ఉంద‌నేది వాస్త‌వం. ఎవ‌రు ఒప్పుకున్నా ఒప్పుకోక‌పోయినా సీనియ‌ర్ యాంక‌ర్ సుమ సంపాద‌న హీరోయిన్ల కంటే ఎక్కువ అన్న టాక్ ఉండ‌నే ఉంది. ఇక యాంక‌ర్ల‌కు కూడా సినిమా ఛాన్సులు బాగా వ‌స్తున్నాయి.


 సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే వీరికి అవకాశం ఇవ్వాలి అనుకునే నిర్మాతలు ఉండటం వారికి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇదే వారికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. టాలీవుడ్ లో ఇప్పుడు అనసూయ కు మంచి డిమాండ్ ఉంది. రంగ‌స్థ‌లం సినిమా త‌ర్వాత అన‌సూయ క్రేజ్ మామూలుగా లేదు. ఆ సినిమాలో రంగ‌మ్మ‌త్త‌గా ఆమె ప్రేక్ష‌కుల మ‌దిలో ఎప్ప‌ట‌కి నిలిచి పోయింది.


ఆమె ఒక సినిమా నిర్మాతతో ఉన్న మంచి సంబంధాలతో స్టార్ హీరోతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాలో ఆమె పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది తెలియదు గాని ఆమె మాత్రం సదరు సినిమా చేయడానికి కాస్త ఎక్కువగా కష్టపడుతుంది. ఆ సినిమాలో ఆమె బికినీ కూడా వేసే అవకాశం ఉందని సమాచారం. కొన్ని సన్నివేశాల్లో ఆమె సెక్సీ గా నటించే అవకాశం ఉందని ప్ర‌చారం జ‌రుగుతోంది.


ఆ సినిమాలో నటనకు ప్రాధాన్యత తో పాటుగా గ్లామర్ కి కూడా మంచి ప్రాధాన్యత ఉందని ఆమె దానిని వాడుకుని భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్ళాలి అని భావిస్తుంది. మరి ఆమె ఏ సినిమాలో అనేది తెలియదు. అయితే ప్రభాస్ సినిమాలో అని కొందరు అంటుంటే కాదు యువ హీరో సినిమాలో అని కొందరు అంటున్నారు. మ‌రి సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అన‌సూయ స్పందిస్తేనే అస‌లు నిజం తెలుస్తుంది.
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: