అక్కినేని నాగార్జున రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఆఫీసర్, యంగ్ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ‘మన్మథుడు 2’ అనుకున్నంతగా సక్సస్ ను సాధించలేకపోయాయి. వాస్తవంగా ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయన్న ధీమ నాగ్ ఫ్యాన్స్ లోనే కాదు కామన్ ఆడియన్స్ లోను బాగా ఉండింది. అందుకు కారణం శివ తర్వాత నాగార్జున వర్మ కాంబినేషన్ కావడం అలాగే బ్లాక్ బస్టర్ మన్మధుడు కి సీక్వెల్ గా మన్మధుడు 2 కావడం. అయితే అందరి అంచనాలను ఈ రెండు సినిమాలు తలకిందులు చేశాయి.

 

అయినా మరోసారి భారీ ప్రయోగం చేయడానికి సిద్దమయ్యారు నాగార్జున. అంతేకాదు ఈ సారి బ్లాక్ బస్టర్ పక్కా అని అంటున్నారు. ఈ సినిమా కోసం నాగార్జున కొన్ని రిస్కీ స్టంట్స్ కూడా చేస్తున్నారట. టాలీవుడ్‌లో ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోల్లో నాగార్జున ముందుంటారు. కమర్షియల్, ఆధ్యాత్మిక సినిమాలతో పాటు ‘గగనం’, ‘ఊపిరి’ వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి నాగార్జున ఎప్పుడు సిద్దంగా ఉంటారు. అంతేకాదు యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలోను నాగ్ ..కింగ్ అని చెప్పాలి. 

 

సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్‌’. నాగార్జున టైటిల్ రోల్‌ పోషిస్తున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిషోర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ‘బ్రహ్మాస్త్ర’ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించే సినిమాలోను నాగార్జున నటిస్తాడన్న వార్త ఒకటి బాగా వైరల్ అవుతోంది. త్వరలో ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన వెలువడనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: