అల వైకుంఠపురములో సూపర్ హిట్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తీస్తున్నాడు. సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమాతో మరో సంచలనానికి సిద్ధమయ్యాడు అల్లు అర్జున్. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కే ఈ సినిమా తర్వాత కూడా బన్నీ పాన్ ఇండియా మూవీస్ చేసేలా కెరియర్ ప్లాన్ చేస్తున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఎలా నేషనల్ స్టార్ అయ్యాడో పుష్ప తర్వాత బన్నీ కూడా అలానే తన సినిమాలన్నీ ఇక పాన్ ఇండియా వైడ్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే పుష్ప తర్వాత కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న తమిళ సూపర్ హిట్ డైరక్టర్ మురుగదాస్ తో సినిమా చేస్తాడని టాక్. 

 

తెలుగు, తమిళ భాషల్లో ముగురగదాస్ కు ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే. తెలుగులో స్ట్రైట్ గా రెండు సినిమాలు తీయగా తమిళ సినిమాలు ఇక్కడ డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం విజయ్ తో తమిళంలో తుపాకీ 2 సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్న మురుగదాస్ తర్వాత సినిమా బన్నీతో చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాను కూడా తెలుగు, తమిళ, హిందీ, మళయాళ భాషల్లో రిలీజ్ చేసేలా స్కెచ్ వేస్తున్నారు. పుష్పతో మొదటిసారి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బన్నీ ఇక మీదట తన అన్ని సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యేలా చూస్తున్నాడు. 


అల్లు అర్జున్ సినిమాలు హింది డబ్ వర్షన్ కు భారీ డిమాండ్ ఉంటుంది. సరైనోడు, రేసుగుర్రం సినిమాలు అక్కడ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సాధించాయి. అందుకే ఇక పూర్తిస్థాయిలో బాలీవుడ్ హీరోగా పేరు తెచ్చుకోవాలని.. అక్కడ ఆడియెన్స్ ను అలరించే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు అల్లు అర్జున్. పుష్ప అనుకున్న రేంజ్ లో హిట్ అయితే మాత్రం బన్నీ కూడా సౌత్ నుండి వెళ్లి బాలీవుడ్ లో సత్తా చాటిన స్టార్ గా గుర్తింపుతెచ్చుకున్నట్టే. 

మరింత సమాచారం తెలుసుకోండి: