కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ ని పాటిస్తూ ఇళ్లలోనే ఉంటున్న సంగతి తెలిసిందే. కోవిడ్ ౧౯ విజృంభణ రోజురోజుకీ పెరుగుతున్న వేళ ప్రజలంతా భయాందోలనకి గురవుతున్నారు. రోజురోజుకీ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జనాలంతా ఇళ్ళలోనే ఉండిపోవడంతో స్వేఛ్చని కోల్పోతున్న మాట నిజం. కరోనా మహమ్మారి నుండి తప్పించుకోవడానికి స్వేఛ్చని కొన్ని రోజులు వదిలేసుకున్నా ఫర్వాలేదని అంటున్నారు.

 

అయితే మనం రెండు నెలలు లాక్డౌన్ లో ఉంటేనే స్వేఛ్చని కోల్పోయామని ఫీల్ అవుతున్నామే మన ఆనందం కోసం జంతువులని బంధించి వాటి స్వేఛ్ఛని హరిస్తున్నామని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం.. ఈ ప్రశ్న టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అడుగుతున్నాడు. మన ఆనందం కోసం జంతువులని బోనుల్లో బంధించి, అవి చేసే పనులని చూస్తూ ఆనందించే మనకి వాటి స్వేఛ్చని హరిస్తున్నామన్నా ఆలోచన కలగట్లేదా..

 

కరోనా వల్ల మనం ఏం కోల్పోయామో అందరికీ తెలిసొచ్చింది. ఇప్పటికైనా వాటి బాధని అర్థం చేసుకోమని చెబుతున్నాడు. పూరి జగన్నాథ్ జంతుప్రేమికుడని అందరికీ తెలుసు. ఆయన తన ఆఫీసులో ఎన్నో రకాల జంతువులని పెంచుకుంటూ కనిపిస్తాడు. పక్షులతో పాటు ఎన్నీ రకాల జంతువులు ఆయన ఆఫీసులో దర్శనమిస్తాయి. ఆఫీసులోనూ వాటిని పూరి జగన్నాథ్ చాలా ఫ్రీగా వదిలేస్తుంటారు.

 

ఈ భూమ్మీద బ్రతికే హక్కు మనకే కాదు వాటికి కూడా ఉందని నమ్మే పూరి జగన్నాథ్, జంతువుల స్వేఛ్చని ఏ విధంగా హరిస్తున్నామో తెలియజేసే వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో బోనుల్లో బంధించి ఉన్న జంతువులు ఎలాంటి అవస్థలు పడుతున్నాయో చూపించారు. ఇప్పటికైనా ఇలాంటివి మానండంటూ సోషల్ మీడియా వేదికగా పూరి జగన్నాథ్ కోరుతున్నాడు. లాక్డౌన్ లో ఉంటూ మనం ఎలా బాధపడుతున్నామో అవి కూడా బోనుల్లో ఉంటూ బాధపడుతున్నాయని అందుకే వాటికి కూడా స్వేచ్ఛని ఇవ్వాలని అంటున్నాడు.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by puri jagannadh (@purijagannadh) on

మరింత సమాచారం తెలుసుకోండి: