రాజకీయాల్లో ఒక నాయకుడు విజయం సాధించాలి లేదా ప్రజలకు దగ్గర కావాలి అంటే కచ్చితంగా ఏదోక కొత్తదనం అనేది తనలో చూపించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలకు దగ్గర కావడానికి గానూ ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆలోచన చెయ్యాల్సి ఉంటుంది నాయకులు. అలా అయితేనే ఏ రాజకీయ నాయకుడు అయినా సరే రాజకీయాల్లో పైకి రావడం లేదా ప్రజల మన్నలను పొందడం వంటివి జరుగుతూ ఉంటాయి. అది ఒక్కటే కాదు ప్రజల మనిషి అనిపించుకోవడానికి ఏ స్థాయిలో ఉన్నా సరే వారికి దగ్గరగా ఉండాలి. 

 

అదే చేసారు ఎన్టీఆర్. ఆయన ప్రచారం గాని మాట్లాడిన మాటలు గాని ఆయన వ్యవహరించిన శైలి గాని ప్రతీ ఒక్కటి కూడా భిన్నం. రాజకీయాల్లో అప్పటి వరకు నాయకులు చేసిన ప్రచారం వేరు అక్కడి నుంచి ఎన్టీఆర్ చేసిన ప్రచారం వేరు. ఎవరు అయినా సరే ఆయన ప్రచారం చూసి ఫిదా అయిన వారే. ప్రజల్లోకి వెళ్ళడానికి ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆలోచించారు. వారిలోనే ఉండి తినడం వారి దగ్గరే స్నానం చేయడం వారి తో కలిసి ముచ్చటించడం వారి బాధలు తెలుసుకుని తన వంతుగా వాటిని పరిష్కరించడానికి కృషి చేయడం వంటివి జరిగాయి. 

 

నటుడిగా ఆయనను ఏ విధంగా తెలుగు జాతి ఆదరించి గుండెల్లో పెట్టుకుందో... అదే స్థాయిలో రాజకీయాల్లో కూడా ఆయనను ఆదరించి గుండెల్లో పెట్టుకున్నారు అనేది వాస్తవం. ఆయన చేసిన రాజకీయాలు ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికి కూడా తెలుగు ప్రజలకు గుర్తున్నాయి అనేది వాస్తవం. తనలో ఉన్న కొన్ని కోణాలను ఆయన ఆవిష్కరించిన తీరు కూడా అభిమానులను సంపాదించి పెట్టింది. ఆయన చేసిన రాజకీయం చూసి ఎన్నికల ప్రచారం చూసి ఆయన ప్రత్యర్ధులు కూడా అప్పట్లో షాక్ అయ్యారు. ఆ విధంగా ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రచారం అనే కోణం లో ఒక ట్రెండ్ సృష్టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: