ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గెలుస్తూనే ఉండేది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నో పార్టీలు పోటీ చేసినప్పటికీ... ఘోరాతి ఘోరంగా ఓడిపోతూనే ఉండేవి. ఆ క్రమంలోనే ఎన్టీఆర్ రాజకీయ రంగంలో ఆరంగేట్రం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలకు అవినీతికి అడ్డుకట్ట వేస్తానని తన ప్రచారంలో చెప్పుకొచ్చిన ఎన్టీఆర్ ని ప్రజలు బాగా నమ్మేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బిడ్డకు న్యాయం జరిగేలా చూస్తానని ఎన్టీఆర్ అప్పటికీ ప్రమాణం కూడా చేశారు. ఆ తర్వాత తాను ముఖ్యమంత్రి పదవిని అధిరోహించి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని సమర్థవంతంగా ప్రవేశపెట్టి... ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. 


ఎన్టీరామారావు పేద విద్యార్థుల కొరకు మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టారు. ఎంసెట్ లాంటి అడ్మిషన్ పరీక్షలను ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసి విద్యా రంగాన్ని బాగా తీర్చిదిద్దారు. తిరుపతి ని బాగా డెవలప్ చేశారు. హైదరాబాద్ నగరంలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ని కట్టించారు. బుద్ధుడి విగ్రహం నిర్మాణానికి కూడా ఎంతో దోహదపడ్డారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతిలో కట్టించారు. తిరుపతి విశాఖపట్నం వరంగల్ విజయవాడ నగరాల్లో ఏర్పాటు నిర్మాణాలకు నాంది పలికారు. కేవలం ఎన్టీరామారావు పరిపాలనలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రోడ్ల నిర్మాణాలు జరిగాయి. చెన్నైలోని ఫిలిం ఇండస్ట్రీ లాగా హైదరాబాద్ లో కూడా షూటింగ్లు చేసుకోవడానికి ఎన్టీరామారావు అనేక ఏర్పాట్లు చేశారు. 


ఏది ఏమైనా ఎన్టీ రామారావు నటుడిగా దాదాపు నాలుగు దశాబ్దాల పైగా అలరించే... ఆ తర్వాత రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశారు. తెలుగు ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేశారు. అందుకే నందమూరి తారక రామారావు ని అన్నగారు దేవుడు అని తెలుగు ప్రజలు అభిమానంతో పిలుచుకుంటుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: