నందమూరి తారకరామారావు మే 28, 1923వ సంవత్సరంలో లక్ష్మయ్య వెంకట రామమ్మ దంపతులకు జన్మించాడు. అని రామారావు పెద్ద నాన్నకి సంతానం కలగకపోవడంతో రామారావునే తన కుమారుడు దత్తత్తు తీసుకున్నారు. 1940లో ఎన్టీఆర్ తమ ఇల్లు గడవడానికి పాల వ్యాపారంలో భాగస్వాములయ్యి ఉదయం 3 గంటల సమయంలో లేచి గేదెలకు గడ్డి వేసి పాలు పిసికి స్థానిక హోటళ్ళ లో పాలు పోసే వాడు. అలాగే మిగిలిన పాలను ఇంటింటికి వెళ్లి పోసేవాడు. ఎన్టీఆర్ తన మొట్టమొదటి క్యారెక్టర్ గా ఒక ఆడ వేషం వేయాల్సి వచ్చింది. 


ఎస్ఆర్ఆర్, సివిఆర్ కళాశాలలో నిర్వహించిన నాటకాలలో ఎన్టీఆర్ ఆడవేశంలో నటించాడు. ఎన్టీ రామారావు తన నాలుగు పదుల వయసులో వెంపటి చిన్న సత్యం వద్ద కూచిపూడి నాట్యం నేర్చుకున్నాడు. 1963లో నర్తనశాల సినిమా కోసం అతను కూచిపూడి నాట్యం నేర్చుకున్నాడు. ఎన్టీ రామారావు తన జీవితంలో ఏకంగా 17 సార్లు కృష్ణుడి పాత్రలో నటించి అందరిని బాగా అలరించాడు. 


తెలుగు స్క్రిప్ట్ రైటింగ్ పై అవగాహన లేని ఎన్టీఆర్ తన సినిమాలకు ఇతర సినిమాలకు కూడా స్క్రీన్ ప్లై లు ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 2004వ సంవత్సరంలో ఎన్టీ రామారావు భార్య ఐన లక్ష్మీపార్వతి తన భర్త బయోగ్రఫీని రెండు పుస్తకాలలో రాసి పబ్లిష్ చేసింది. మొదటి తన సినిమాల గురించి ఎదురులేని మనిషి అనే శీర్షికతో విడుదల చేయగా మరొకటి... భర్త రాజకీయ విశేషాల గురించి తెలుగు తేజం అనే పుస్తకం రాసింది. ఎన్టీ రామారావు తన 72వ వయసులో హార్ట్ అటాక్ కారణంగా మరణించాడు. 


చంద్రబాబునాయుడు రాజకీయాల్లో అడుగు పెట్టగానే తొమ్మిది నెలల సమయం లోనే ఎన్టీఆర్ ని గవర్నమెంట్ నుండి పార్టీ నుండి దిగేలా చేసారని లక్ష్మీపార్వతి అనేక సందర్భాల్లో తెలిపింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కి టిడిపి నుంచి ఎటువంటి మద్దతు లభించలేదు. అందుకే చంద్రబాబు నాయుడు పై లక్ష్మీపార్వతి కి తీవ్ర ఆగ్రహం ఉంటుంది. 2004లో సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఎన్టీఆర్ అస్తికలను శ్రీరంగపట్నం లో కలిపింది లక్ష్మీపార్వతి.

మరింత సమాచారం తెలుసుకోండి: