టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చాలా బిజీగా సినిమాలతో ఉండి ఉండొచ్చు. కాకపోతే ఆయన ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. ఇక నందమూరి వంశంలో సీనియర్ ఎన్టీఆర్ తరహాలో జూనియర్ ఎన్టీఆర్ తన క్రేజ్ ని పెంచుకున్నాడు అంటే ఆయన ఎంత కష్టపడతారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఒకానొక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ తన తాత సీనియర్ ఎన్టీఆర్ పై కోపగించుకొన్నారట. కాకపోతే ఆ సమయానికి సీనియర్ ఎన్టీఆర్ గారు ప్రాణాలతో లేరు. ఈ విషయాలను జూనియర్ ఎన్టీఆర్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు తెలియ జేశాడు. మొదట్లో జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీకి చాలా దూరంగా ఉండడం మనందరికీ తెలిసిన విషయమే. తన తల్లి తోనే ఉంటూ నటనపై ప్రత్యేక శిక్షణ పొందారు. జూనియర్ ఎన్టీఆర్ తన తాత సీనియర్ ఎన్టీఆర్ ని తనకు 11 సంవత్సరాలు ఉన్నప్పుడు మొదటిసారి చూశారట. అప్పటివరకు తన తాతని ఫోటోలో చూడటం తప్ప డైరెక్టుగానే చూడలేదట. 

 

అయితే జూనియర్ ఎన్టీఆర్ కు 101 డిగ్రీల జ్వరం ఉన్నప్పుడు తన తాతగారి నుంచి పిలుపు వచ్చిందట. దీంతో ఆయన మొదటిసారి తన తాతని కలవడానికి ఎంతో సంతోషంగా వెళ్ళాడట. అక్కడికి చేరుకున్న తర్వాత సీనియర్ ఎన్టీఆర్ తనని చూసి తన నా నటవారసుడు నేనే అని మా నాన్నను పిలిచి చెప్పాడు అని తెలియజేశారు. అంతే కాకుండా నాకు తారక్ రామ్ అనే పేరు తీసేసి నందమూరి తారక రామారావు అని పేరు పెట్టమని కూడా సీనియర్ ఎన్టీఆర్ తెలిపారట.

 


ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు అమ్మని పిలిపించి ఇన్నాళ్లు జరిగిన విషయాలన్నీ మర్చిపోండి అని, ఆప్యాయంగా పలకరించి అమ్మని పిలిచి ఒక మాట మాట్లాడారు. నా వంశోద్ధారకుడు నీ కడుపున పుట్టాడు నా అంతటి వాడిగా అతని తీర్చిదిద్దే  నువ్వు బాధ్యత తీసుకో... నా వంతు బాధ్యత నేను నిర్వహిస్తాను అని తాతగారు చెప్పగానే నాకు చాలా సంతోషం వేసింది అని, ఆ మాటలు ఇప్పటికి నేను మర్చిపోలేను అని ఆయన తెలిపాడు.

 


ఇక పోతే ఆ తర్వాత కొద్ది రోజులకే సీనియర్ ఎన్టీఆర్ చనిపోగానే చాలా బాధ వేసింది అని తెలిపాడు. మాకు ఒక దిక్కు వచ్చిందని ధైర్యంలో ఉన్నప్పుడే ఇంతలోనే మళ్ళి అనాధ లాగా వదిలేశారని బాధలో కోపం వచ్చిందని జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నీ ముందర ఇంత ఉన్నాడు అంటే, అది కేవలం ఆయన పేరు పెట్టుకున్నందుకు అని ఒక ఇంటర్వ్యూలో భావోద్వేగంతో తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: