తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని కీర్తిని సంపాదించి రాజకీయాలలో కూడా తెలుగోడి సత్తా చాటి  నందమూరి తారక రామారావు తెలుగు ప్రజలందరికీ కారణజన్ముడు గా మారిపోయాడు. అనితర సాధ్యమైన గుర్తింపును తెలుగు చిత్ర పరిశ్రమలు సొంతం చేసుకొని... తరతరాల చరిత్రను తిరగరాసే తెలుగోడి గొప్పతనాన్ని రాజకీయాలలో చాటి చెప్పటం అన్నది  ఒక ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యం అయింది అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవ్వరికీ సాధ్యం కాని కీర్తిని సంపాదించి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి... ఎంతో  పేరు ప్రఖ్యాతలను సంపాదించింది ఒక మహోన్నత వ్యక్తిగా ఎదిగారు  నందమూరి తారక రామారావు. 

 

 

 అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న సమయంలోనే ప్రజా సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగారు నందమూరి తారక రామారావు. ఇతర పార్టీలలోకి వెళ్లి ప్రజా సేవ చేయడం కంటే తెలుగోడి గౌరవాన్ని మరింత చాటి చెప్పేలా ఒక పార్టీని స్థాపించి ప్రజలకు సేవ చేయాలని భావించి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అయితే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏకచక్ర ఆధిపత్యం గా రాజ్యమేలుతోంది. అలాంటి కాంగ్రెస్ పార్టీని ఓడించి కొత్తగా స్థాపించిన ఒక స్థానిక పార్టీ సత్తా చాటడం అనేది  అసాధ్యమని అనుకున్నారు అందరు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రజలందరినీ ప్రభావితం చేసి.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏదో మంచి జరుగుతుందనే భావన ప్రతి ఒక్కరిలో కలిగించి పార్టీ స్థాపించిన కేవలం తొమ్మిది నెలల కాలంలోనే... తరతరాలుగా రాజ్యమేలుతున్న కాంగ్రెస్ పార్టీ ని పక్కకు నెట్టి కొత్త చరిత్ర సృష్టిస్తూ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు నందమూరి తారక రామారావు. 

 


 ఆ తర్వాత తెలుగు రాజకీయాలలో మకుటం లేని మహారాజుగా ఎన్నో ఏళ్ల పాటు ఓ వెలుగు వెలిగాడు నందమూరి తారక రామారావు. నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సమయంలో ఆయనకు ఎదురు చెప్పేవారే లేరు... ఆయన ఏది చెబితే అది శాసనం... ఎన్టీఆర్ ఏం చేసినా తమ మంచి కోసమే అని అనుకునేవారు ప్రజలు. ఎందుకంటే ఎన్టీఆర్ ప్రత్యక్ష దైవంగా భావించే తెలుగు ప్రజలు ఎలాంటి సమయంలో అయినా ఆయన వెన్నంటే  నిలిచారు. ఓవైపు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఖ్యాతిని సంపాదించి ఎంతోమంది అభిమానులను సంపాదించటం... ఇక తరతరాల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోవటం... మొట్టమొదటి తెలుగోడు పార్టీ కావడం... ఇవన్నీ ఎన్టీఆర్ ఏకచక్ర ఆధిపత్యం కొనసాగేందుకు కారణాలుగా కూడా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: