నందమూరి తారక రామారావు... ఈ పేరు వింటే చాలు తెలుగోడికి పూనకం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు తెలుగోడికి ప్రత్యక్షదైవంగా నిలిచారు నందమూరి తారక రామారావు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సాదాసీదా వ్యక్తి గా పరిచయమైన నందమూరి తారకరామారావు ఒక గొప్ప శక్తిగా మారిపోయారు. అయితే నందమూరి తారకరామారావు కేవలం ఒక హీరో ఒక రాజకీయ నాయకుడు అని చెప్పడం కంటే ఆయన గొప్ప కారణజన్ముడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన ప్రస్థానం అంత అద్భుతంగా కొనసాగింది మరి. నందమూరి తారక రామారావు దాదాపుగా తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో కలిపి మొత్తంగా 400కు పైగా సినిమాల్లో నటించారు. 

 


 ఇది ఇప్పటికీ కూడా ఏ హీరోకి సాధ్యం కాలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే సినిమాల్లో టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న సమయంలోనే నందమూరి తారక రామారావు ప్రజా సేవ చేయాలని భావించిన విషయం తెలిసిందే. రాజకీయాలలో కూడా తెలుగు వాడు ఎక్కడ తక్కువ కాదు అని నిరూపించాలి అనే సంకల్పంతో ముందుకు సాగారు నందమూరి తారక రామారావు. ఇలాంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రజలు మాత్రం ఎన్టీఆర్ వెంట నడిచారు. అయితే నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించేందుకు నిర్ణయించేటప్పటికి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి  మిత్రుడిగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు చంద్రబాబు నాయుడు. 

 

 ఇక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత కొన్నాళ్ళకి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరాడు. అయితే తెలుగుదేశం పార్టీలో చేరేటప్పటికే కొంత రాజకీయ అనుభవం చంద్రబాబు నాయుడు సొంతం. ఇక తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత కీలక నేతగా ఏకంగా ఎన్టీఆర్ అల్లుడిగా మారిపోయాడు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత క్రమక్రమంగా ఎన్టీఆర్ నుంచి పార్టీని సొంతం చేసుకుని పార్టీకి అధినేతగా మారిపోయారు. క్రమక్రమంగా తన దైన వ్యూహాలతో రాజకీయాలలో ఎంతో అనుభవం సంపాదించారు. అయితే ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే... ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించక  పోయి ఉంటే... కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా పోటీ ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చాలా తక్కువగానే ఉండేవి... ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడం వల్లే ఇంత అనుభవాన్ని సంపాదించగలరు చంద్రబాబునాయుడు అనడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: