విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామ.. ఈ పేరు వింటే చాలు తెలుగులో ఏదో తెలియని గౌరవం కలుగుతుంది. తెలుగు ప్రజల ప్రత్యక్ష దైవంగా మారిపోయాడు నందమూరి తారక రామారావు. ఒక సాదాసీదా వ్యక్తి గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నందమూరి తారకరామారావు మహోన్నత వ్యక్తిగా ఎదిగారు. ఏ హీరోకి సాధ్యం కాని గొప్ప కీర్తిని సంపాదించారు నందమూరి తారక రామారావు. తెలుగు చిత్ర పరిశ్రమలో  ఎన్నో ఏళ్ల పాటు విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించిన నందమూరి తారక రామారావు... తెలుగోడికి ఖ్యాతిని ఎలుగెత్తి చూపారు . అయితే చిత్ర పరిశ్రమలో ఎంతో ఖ్యాతి గల వ్యక్తిగా కొనసాగుతున్నప్పటికీ ఆ తర్వాత... ప్రజా సేవ చేయాలని భావించారు నందమూరి తారక రామారావు. 

 


 ప్రజల్లోకి వెళ్లి ప్రజా సేవ చేయాలని భావించి తెలుగుదేశం అనే పార్టీని స్థాపించారు. అయితే ఎలాగైతే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయనకు తిరుగులేదు అని ఎలా నిరూపించారో... అదే రీతిలో రాజకీయాల్లో కూడా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ చరిత్ర సృష్టించారు నందమూరి తారక రామారావు. ప్రజల ప్రత్యక్ష దైవం గా మారిపోయిన నందమూరి తారక రామారావు... తెలుగు ప్రజలందరికీ ఒక గొప్ప నాయకుడిగా మారిపోయాడు. అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగు ప్రజల్లో దేవుడి గా మారిన నందమూరి తారక రామారావు... ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన వాళ్ళలో ఒకరుగా ఉన్నారు. 

 


 అయితే ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో రెండు కోణాలు ఉంటాయి. ఒకటి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి... అప్పడి వరకూ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఏకచక్ర ఆధిపత్యం కొనసాగిస్తూ తిరుగులేదని నిరూపించుకున్న  కాంగ్రెస్ పార్టీ ఓడించి తొమ్మిది నెలల కాలంలోనే ఘన విజయాన్ని సాధించి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం... ఎన్నో ఏళ్ల పాటు ఆయన చెప్పింది శాసనంగా తెలుగు రాజకీయాలను  నడపడం... కానీ ఆ తర్వాత ఎప్పుడైతే తన అల్లుడు చంద్రబాబు నాయుడుకి  పార్టీలో  కీలక పదవి ఇచ్చినప్పటి నుంచి ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మార్పులు కొనసాగుతూ వచ్చాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మామ ఎన్టీఆర్ నుంచి పార్టీని కైవసం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు అన్నది ఎప్పటినుంచో వినబడుతున్న వాదన.  చివరికి ఎమ్మెల్యేలందరినీ తనవైపుకు తిప్పుకుని ఎన్టీఆర్ను గద్దె దిగేలా  చేశారు చంద్రబాబు నాయుడు. పార్టీకి పూర్తిగా దూరం చేశాడు. ఇలా ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో రెండు కోణాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: