తెలుగు చిత్ర పరిశ్రమలో అన్నగారు నందమూరి తారక రామారావు కి ఉన్న జాతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగోడి గౌరవాన్ని... తెలుగువాడి పౌరుషాన్ని... తెలుగు వాడు కష్టించే గుణాన్ని దేశం మొత్తం చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు. ఒక సాదాసీదా వ్యక్తి గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నందమూరి తారక రామారావు... ఎంతో  విజయవంతంగా సినీ ప్రస్థానాన్ని కొనసాగించి.. మహోన్నత శక్తిగా ఎదిగారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అనితర సాధ్యమైన గుర్తింపును ఖ్యాతిని సంపాదించారు నందమూరి తారక రామారావు. కేవలం సినిమాల ద్వారానే కాదు ప్రజా సేవ ద్వారా కూడా ఎంతగానో గుర్తింపు సంపాదించారు నందమూరి తారక రామారావు. 

 


 అప్పటికే సినిమాల్లో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ అనే బిరుదాంకితుడు గా ఎవరికీ సాధ్యం కాని గుర్తింపును ఖ్యాతిని సంపాదించిన నందమూరి తారకరామారావు ఆ తర్వాత ప్రజా సేవ వైపు అడుగులు వేసిన విషయం తెలిసిందే. అప్పటికే  ఏకఛత్రాధిపత్యంగా అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యమేలుతోంది. అలాంటి సమయంలో ఎంతో ప్రఖ్యాతి గాంచిన జాతీయ పార్టీని ఎదిరించి కొత్త పార్టీని స్థాపించి నిలదొక్కుకోవడం అంటే ఎంతో సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పాలి. ఇది దాదాపుగా అసాధ్యమైన పనే అని చెప్పాలి. ఎందుకంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఒక రాజకీయ పార్టీ అని ఒక భావన ఉండేది. అలాంటి సమయంలో ఒక తెలుగువాడు పార్టీని స్థాపించి దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడం అంటే అది అసాధ్యమైన పని. 

 

 అలాంటి అసాధ్యమైన అసాధారణమైన విషయాన్ని కూడా సుసాధ్యం చేస్తూ తెలుగుదేశం పార్టీని స్థాపించారు నందమూరి తారక రామారావు. ఇక ఆయన పార్టీ ని స్థాపించిన  కేవలం తొమ్మిది నెలల కాలంలోనే తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని ఏకంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు నందమూరి తారక రామారావు. తొమ్మిది నెలల సమయం లోనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం అంటే అది మామూలు విషయం కాదు. అది కూడా తరతరాలుగా ఏకచక్ర ఆధిపత్యం కొనసాగిస్తున్న జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ని  వెనక్కి... ఘన మెజారిటీని సొంతం చేసుకొని తరతరాల చరిత్ర తిరగరాశారు నందమూరి తారక రామారావు.

మరింత సమాచారం తెలుసుకోండి: