తెలుగు సినిమాకు సంబంధించి ప్రేక్షకుల ఆరాధ్యదైవంగా వారి మనసుల్లో నిలిచిపోయారు మహానటుడు నందమూరి తారక రామారావు. సుదీర్ఘమైన ఆయన కెరీర్లో ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. ఏ హీరో సినిమా అయినా మంచి అంచనాలతో వచ్చి హిట్ సాధిస్తే తిరుగులేని రికార్డులు సాధిస్తుంది. అటువంటి భారీ అంచనాల మధ్య విడుదలైన ఎన్టీఆర్ సినిమా ‘జస్టిస్ చౌదరి’. ఎన్టీఆర్ పుట్టినరోజు నాడే విడుదలైన ఈ సినిమాకు నేటితో 38 ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా 1982 మే 28న విడుదలైంది. అప్పటికే ఎన్టీఆర్ – రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వేటగాడు, కొండవీటి సింహం, డ్రైవర్ రాముడు, గజదొంగ.. వంటి సూపర్ హిట్లు వచ్చాయి. దీంతో ఈ సినిమా భరీ అంచనాల మధ్య విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఎన్టీఆర్ వయసుకు తగ్గ పాత్రలో జీవించారు. తన గాంభీర్యంతో సినిమాకు వన్నె తెచ్చారు. విడుదలైన ప్రతి చోటా మంచి కలెక్షన్లు రాబట్టింది. హీరోయిన్ గా శ్రీదేవి నటించింది. వీరిద్దరి కాంబినేషన్ లో అప్పటికే వేటగాడు వంటి బ్లాక్ బస్టర్ ఉంది. ఈ సినిమాలో కూడా వీరిద్దరి జోడీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

IHG

 

చక్రవర్తి సంగీతంలోని పాటలన్నీ సూపర్ హిట్టై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సత్యానంద్ కథ, మాటలు అందించారు. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించిన ఈ సినిమా 31 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. విజయలక్ష్మీ ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై టి. త్రివిక్రమరావు ఈ సినిమా నిర్మించారు. అదే ఏడాది దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘బొబ్బిలిపులి’ వచ్చే వరకూ జస్టిస్ చౌదరినే పెద్ద హిట్. అదే ఏడాది ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం చేయడంతో 1982 ఆయనకు బాగా కలిసొచ్చిన సంవత్సరంగా మిగిలిపోయింది.

IHG

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: