మాస్ రాజా రవితేజ, రమేష్ వర్మ తో రెండో సారి సినిమా చేయనున్నాడని తెలిసిందే. జులై లో ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వీర డిజాస్టర్  ఫలితాన్ని రాబట్టింది అయితే ఇటీవల రాక్షసుడు తో హిట్ కొట్టి రమేష్ వర్మ ఫామ్ లోకి రావడంతో రవితేజ రెండో సారి అవకాశం ఇచ్చాడు. ఇక ఈసినిమాకు టైటిల్ కూడా  ఖరారు చేశారని సమాచారం. రవితేజ మార్క్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈచిత్రానికి కిలాడీ అనే టైటిల్ ను పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది. సినిమా లాంచ్ రోజు టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. కోలీవుడ్ మూవీ శతురంగ వెట్టై 2 కు ఫ్రీ మేక్ గా రూపొందనున్న ఈచిత్రాన్ని కోనేరు సత్యనారాయణ , హవీష్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈసినిమా  కోసం మేకర్స్ హీరోయిన్ ను వెతికే పనిలో వున్నారు. 
 
ఇక ప్రస్తుతం రవితేజ,క్రాక్ లో నటిస్తున్నాడు. బలుపు ఫేమ్ గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. ఆగస్టులో ఈసినిమా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన క్రాక్ టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా త్వరలోనే ఈసినిమా నుండి ఓ సాంగ్ కూడా విడుదలకానుంది. 
 
ఈసినిమాలతో పాటు రవితేజ మరో రెండు సినిమాలకు  ఓకే చెప్పాడు. అందులో నాపేరు సూర్య తో డైరెక్టర్ గా మారిన వక్కంతం వంశీ తో సినిమా చేయనున్నాడు.  ఏకే ఎంటెర్టైన్మెంట్స్  పతాకం పై అనిల్ సుంకర ఈసినిమాను నిర్మించనున్నాడు. ఈ సినిమాతోపాటు త్రినాథ రావు నక్కిన తో కూడా రవితేజసినిమా చేయనున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: