ఇక ఇప్పుడు మన దేశంలో సినిమాకు వచ్చిన కష్టం గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. దేశ వ్యాప్తంగా కూడా వేలాది మంది సినిమాలు లేక రోడ్డున పడిన పరిస్థితి మనం చూస్తున్నాం. సినిమా కార్మికులను ఆదుకోవడానికి ఎవరు ఎన్ని విధాలుగా సహాయ కార్యక్రమాలు చేసినా సరే వారిని కష్టాల నుంచి తీసుకుని రావడం ఇప్పుడు అనుమానమే. దీని తో కొందరు నటులు ఆత్మ హత్యలు కూడా చేసుకునే పరిస్తి ఉంది. మన దేశంలో ఇప్పుడు కేంద్రం వారి కోసం ముందుకు రావాలి అని కొందరు కోరుతున్నారు. 

 

ఈ తరుణంలో కేంద్ర సర్కార్ ని తెలుగు సినీ పెద్దలు కలిసి తమ రాష్ట్రం లో  ఉన్న సినీ కార్మికులను ఆదుకోవాలి అని కోరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఇప్పుడు వాళ్ళు అందరూ రోడ్డున పడ్డారు అని కేంద్రం అండగా నిలబడాలి అని, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉందని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో దాదాపు కోటి మంది వరకు సినీ కార్మికులు ఉన్నారు. వారి అందరి కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు. త్వరలోనే చిరంజీవి బాలకృష్ణ సహా కొందరు ఢిల్లీ వెళ్ళే సూచనలు ఉన్నాయని అంటున్నారు. 

 

ఇక ఇప్పట్లో సినిమా షూటింగ్ లు మొదలయ్యే అవకాశాలు లేవు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. కేంద్రం సినిమాల షూటింగ్ లకు లాక్ డౌన్ 5 లో అనుమతులు ఇచ్చే అవకాశం  లేదని వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఏపీ తెలంగాణా లో జూన్ నుంచి సినిమా షూటింగ్ లు మొదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తో సినీ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: