లాక్ డౌన్ కారణంగా సినిమాల షూటింగ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఇప్పుడు దాదాపుగా అన్ని సినిమాల షూటింగ్ ని వాయిదా వేసారు. కీలక సినిమాల షూటింగ్ లు కూడా వాయిదా పడ్డాయి. ఇక ఎప్పుడు సినిమాల షూటింగ్ మొదలు అవుతుంది అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పడం దాదాపుగా కష్టమే. అగ్ర హీరోల సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు షూటింగ్ కి వెళ్ళే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కాని అది మాత్రం జరిగే అవకాశం లేదు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 

 

ఇక ఈ సినిమాల షూటింగ్ మొదలైనా సరే కొన్ని కొన్ని సన్నివేశాలు లేకుండానే సినిమాలు ఉండే అవకాశం ఉందని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. లిప్ లాక్ సన్నివేశాలు  లేకుండానే హగ్ లు ముద్దులు ప్రేమలు ఆప్యాయతలు లేకుండానే సినిమాల షూటింగ్ లు జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇప్పుడు సినిమాల షూటింగ్ కి కేంద్రం గనుక అనుమతి ఇస్తే ఇదే షరతు తో ఇచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ తో  పాటు బాలీవుడ్ కూడా భావిస్తుంది. అగ్ర హీరోల సినిమాల్లో ఉండే నటులకు కూడా కొన్ని షరతు లు ఉండే అవకాశం ఉంది. 

 

విదేశాల నుంచి వచ్చే నటుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. క్వారంటైన్ లో ఉంచిన తర్వాతే సినిమాల షూటింగ్ లకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఏ సినిమా నటుడు అయినా సరే ఎంత పెద్ద నటుడు అయినా సరే కేంద్రం సూచనలు చేసిన చోట మాత్రమే క్వారంటైన్ లో ఉండాలని లేకపోతే షూటింగ్ లకు అతన్ని అనుమతించవద్దు అని చెప్పే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరి దీనికి నటులు అంగీకరిస్తారో లేదో చూడాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: