తెలుగు చిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా... తెలుగు ప్రజలందరికీ కారణ జన్ముడుగా.. తెలుగు ప్రజలకు ఖ్యాతిని  ఎల్లలు దాటిన మహోన్నత వ్యక్తిగా ... తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక మూలస్తంభంగా... తన ప్రస్థానాన్ని కొనసాగించారు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. అయితే అప్పుడు వరకు ఎంత మంది హీరోలు ఉన్నప్పటికీ... తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి ఎంతగానో పెరిగిపోయింది అని చెప్పాలి. అయితే ఎన్నో వందల సినిమాల్లో నటించినా నందమూరి తారక రామారావు... తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. 

 

 ఆయన ప్రస్తుతం ఈ లోకంలో లేకపోయినప్పటికీ ఆయన జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల తోనే ఉన్నాయి. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పట్లో  తెలుగు వాళ్ళు చాలా తక్కువ మందే ఉండేవారు అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ అప్పట్లో మద్రాసులో కొనసాగుతూ ఉండేది. మద్రాసు కేంద్రంగా తెలుగు చిత్ర పరిశ్రమ కొనసాగగా...  ఇక ఎంతో మంది దర్శకులు నిర్మాతలు హీరోలు హీరోయిన్లు అందరూ మద్రాస్ వేదికగానే సినిమాలను తెరకెక్కించటం... అన్ని వ్యవహారాలు చూసుకోవడం లాంటివి చేస్తూ ఉండేవారు. కానీ నందమూరి తారకరామారావు దానిని మాత్రం ఒప్పుకోలేదు... తెలుగు చిత్ర పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ నుండి  నడిపించాలని భావించారు. 

 

 దీనికోసం ఎన్టీఆర్ ఆప్తమిత్రుడైన అక్కినేని నాగేశ్వరరావుతో చర్చించారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు మొదట తెలుగు చిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్ నగరానికి తరలించడానికి ముందు కాస్త సంశయించినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఎన్టీఆర్ పట్టుబట్టడంతో ఒప్పుకున్నారు. ఇలా ఎన్టీఆర్ ఎంతో దృఢ సంకల్పంతో ముందుకు సాగడం కారణంగానే... మద్రాస్ వేదికగా కొనసాగిన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం హైదరాబాద్ వేదికగా కొనసాగుతోంది.ఒకవేళ ఎన్టీఆర్ ఈ ప్రస్తావన తెరమీదికి తేకపోయి ఉంటే ఇప్పటికి కూడా తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాస్ వేదికగానే కొనసాగేదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: