ఇప్పటికీ ఎప్పటికీ తెలుగోడి ఆత్మగౌరవాన్ని గౌరవాన్ని నిలబెట్టి తెలుగువాడి ఖ్యాతిని ఎల్లలు  దాటేల  చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ గురించి తెలుగు ప్రేక్షకులందరూ ఎన్నటికీ మరువరు అన్న విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకులందరూ కారణ జన్ముడుగా భావించే నందమూరి తారక రామారావు.. సినీ ప్రస్థానం రాజకీయ ప్రస్థానం ఎందరికో ఆదర్శ ప్రాయమైనది. ఒక సాదా సీదా కుటుంబంలో జన్మించిన నందమూరి తారక రామారావు... చిత్ర పరిశ్రమలో రాణించాలనే ఉద్దేశ్యంతో... ఎన్నో కష్టాలు పడి చివరికి తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు దక్కించుకున్నాడు. అయితే సీనియర్ ఎన్టీఆర్ తొలినాళ్లలోనే... రాబోయే తరానికి ఈయన  ఆదర్శ ప్రాయుడు అవుతాడు  అని అప్పట్లో దర్శక నిర్మాతలు కూడా అనుకున్నారట. ఈయన  సాదాసీదా మనిషి కాదు ఒక కారణజన్ముడు లాంటి గొప్ప మహోన్నత వ్యక్తి గా ఎదుగుతాడు అని దర్శక నిర్మాతలందరూ అప్పుడే ఊహించారుట. 

 

 అందరూ అనుకున్న విధంగానే అంచెలంచెలుగా ఎదుగుతూ... ఒక సాదాసీదా హీరోగా కాకుండా తెలుగోడి గౌరవాన్ని ఖ్యాతిని చాటి చెప్పేందుకు జన్మించిన కారణ జన్ముడు గా మారిపోయాడు నందమూరి తారక రామారావు. ఇక ఆనాటి కాలంలో నందమూరి తారక రామారావు తెలుగు ప్రజలందరికీ ఒక ప్రత్యక్ష దైవంగా మారిపోయాడు. ఎందుకంటే నందమూరి తారక రామారావు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో పౌరాణిక సినిమాల్లో నటించి సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ సినిమాల్లో చరిత్రలోని దేవుళ్ళందరూ పాత్రలో ఎన్టీఆర్  నటించారు. 

 


 ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన పాత్రల్లో  ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన పాత్రలు రాముడు కృష్ణుడు. అయితే నిజమైన రాముడు కృష్ణుడు కూడా అచ్చం నందమూరి తారక రామారావు లాగే ఉంటారేమో  అనేంతలా  తెలుగు ప్రేక్షకులను ప్రభావితం చేశారు నందమూరి తారక రామారావు. అందుకే తెలుగు ప్రేక్షకులందరూ నిజంగా రాముడు కృష్ణుడు నందమూరి తారక రామారావేనేమో  అంటు  ప్రత్యక్ష దైవంగా భావించేవారు. అందుకే ఎన్టీఆర్ నట జీవితం ఎప్పటికి  ఆదర్శప్రాయంగా నిలుస్తుంది.  దేవుని ఫోటోల్లో  చూడడమే కాదు నందమూరి తారకరామారావు రూపంలో ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము అనుకొనేవారు నాటి ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: