గత మూడు నెలలుగా దేశంలో లాక్ డౌన్ విధించడంతో చిన్న, పెద్ద, బడుగు, బీద, డబ్బు ఉన్నోడు, డబ్బు లేని వాడు ఇలా అని తేడా లేకుండా అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. అయితే ప్రస్తుత లాక్ డౌన్ కారణంగా కొన్ని నిబంధనలను సడలించడంతో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ పూర్తిగా మూతపడ్డాయి. అయితే వచ్చే నెల ఒకటో తారీకు నుంచి తిరిగి మళ్ళీ షూటింగ్ మొదలు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

 


ఇక అసలు విషయంలోకి వెళితే.... సెలబ్రిటీలు అంటేనే గుర్తుకు వచ్చేది వారి ఫిట్నెస్. వారు రోజు ఎటువంటి వర్కౌట్స్ చేస్తున్నారో, వారి గురించి ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి వారి అభిమానుల్లో చాలా ఆసక్తి ఉంటుంది. వారు ఎలా కనిపించినా సరే నిజ జీవితంలో మాత్రం ఫిట్ నెస్ విషయంలో వాళ్ళు అసలు రాజీపడరు. షూటింగ్ ఉన్న సరే ఎంత బిజీగా ఉన్నా సరే సమయం దొరికినపుడు మాత్రం ఖచ్చితంగా జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూనే ఉంటారు. దీంతో ఇప్పటికే అనేక మంది సెలబ్రెటీలు హోమ్ వర్క్ అవుట్స్ తో మనల్ని మెప్పించారు. వారి ఇంట్లో ఉన్న సామగ్రి తోనే చేసి మీరు కూడా ఇలా ప్రయత్నించండి అంటూ అనేక వీడియోలు నెట్టింట్లో పోస్ట్ చేశారు. 

 


ఇకపోతే ఈ ఫిట్ నెస్ విషయంలో హీరోయిన్స్ విషయం కొస్తే మొదటిగా చెప్పుకునేది సమంత. తాను ఇంట్లోనే ఉంటూ ట్రైనర్ చెప్పిన విధంగా వర్కౌట్ లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన ఒక వీడియోలో సైతం తన ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఫిట్నెస్ దృష్ట్యా తనకున్న డెడికేషన్ మరోసారి సమంత తెలియజేసింది. అయితే మొదటిసారిగా తన వర్కౌట్స్ కు సంబంధించి సామాజిక మార్గాల్లో తన మొదటి వీడియోను పోస్ట్ చేయడం ద్వారా అందరి చూపులను తనవైపు తిప్పుకుంది అక్కినేని అమల. 

 


అలాగే హీరో సుధీర్ బాబు కూడా తన వర్క్ అవుట్స్ ను ప్రతి రోజు ఒక వీడియో ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇదివరకే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా తన యోగాతో అందరినీ మెప్పించగా, రకుల్ ప్రీత్ సింగ్ సూర్య నమస్కారాలు చేసింది. ఇక మన యంగ్ హీరో వరుణ్ తేజ తన తదుపరి సినిమాలో కోసం వర్కౌట్లు చేస్తూ మునిగి తేలుతున్నారు. అలాగే మరో హీరో కార్తికేయ కూడా ఇంట్లోనే ఉంటూ తగిన వర్కౌట్స్ చేస్తూ తన సిక్స్ ప్యాక్ లుక్ తో కనిపించి అందరికీ షాక్ కు గురి చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: