టాలీవుడ్ లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘అరుంధతి’ మూవీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.  ఇందులో వదల బొమ్మాళీ వదల అంటూ భయంకరమైన అఘోరాగా బాలీవుడ్ నటుడు సోనూసూద్ నటించాడు.  అంతకు ముందు పూరి దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన ‘సూపర్ ’ మూవీలో నటించాడు.  ఇలా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విలన్ పాత్రల్లో నటిస్తున్నారు సూనూ సూద్.  అయితే గత రెండు నెలల నుంచి లాక్ డౌన్ కారణంగా ఆయన పేదలకు చేస్తున్న సేవ.. ఈ మద్య వలస కార్మికుల విషయంలో సూనూ సూద్ చేస్తున్న మంచి పనులు ఆయన్ని రియల్ హీరోగా చేశాయి. 

IHG

కరోనా వైరస్ ప్రభావం వల్ల బాధపడుతున్న చాలామందికి సహాయం చేసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్. బాలీవుడ్ నటుడు మాత్రమే కాకుండా విలన్ పాత్రలు చేయడం వల్ల కూడా బాగా పాపులర్ అయ్యాడు. ఇటీవల కాలంలో అతను బస్సులను అద్దెకు తీసుకొని మహారాష్ట్ర నుండి వలస వచ్చిన కార్మికులను వారి ఇళ్లకు పంపించడానికి చేసిన ప్రయత్నాల వల్ల చాలా మందికి నిజ జీవిత హీరోగా మారిపోయాడు. కొవిడ్ చికిత్స కోసం పనిచేస్తున్న వైద్య సిబ్బంది బస కోసం ముంబైలోని తన హోటల్‌ను ఇచ్చాడు. బస్సు సేవలు, ఇతర సహాయాల కోసం ఎంతో మంది సోనూను సోషల్ మీడియా ద్వారా సంప్రదిస్తున్నారు.

IHG

తాజాగా సోనూ సూద్ తన మొబైల్ నోటిఫికేషన్ బార్‌ను తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నాడు. `మీ సందేశాలు ఎంతో వేగంతో మాకు చేరుతున్నాయి. ప్రతి ఒక్కరికి సహాయం చేసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ కొందరి అభ్యర్థనలను మేం మిస్ అయినట్టైతే.. క్షమించండి` అని పేర్కొన్నాడు. వేలాది మంది వలసదారులను ఇంటికి పంపించడానికి సోను లక్షల రూపాయలు ఖర్చు చేశారు రియల్లీ యు ఆర్ ద రియల్ హీరో అంటూ నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: