తక్కువ కాలంలో మన తెలుగులో పాపులర్ అయిన హీరోయిన్ సాయి పల్లవి ఆమె నటనకు అభిమానులు బాగా బాగా ఫిదా అయిపోయారు. ఇక ఆమె సినిమాలు ఆమె నటన గురించి తమిళంలో మలయాళం లో తెలుగులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమాలు కూడా నటన కు ఎంతో ప్రాధాన్యత ఉన్న సినిమాలే కావడం విశేషం. ఆమె రెండు సినిమాలను తెలుగు లో యువ హీరోల పక్కన చేస్తుంది. ఈ సినిమాలు రెండు కూడా వచ్చే ఏడాది రానున్నాయి అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఇప్పుడు ఆమె మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

 

యువ హీరో తో ఒక సినిమా చేయడానికి గానూ ఆమె ప్రయత్నాలు చేస్తుంది. టాలీవుడ్ లో తక్కువ కాలంలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ తో ఆమె సినిమా చేస్తుంది అని సమాచారం. శర్వా తో ఆమె గతంలోనే ఒక సినిమా చేసింది. ఈ సినిమాలో ఆమెకు మంచి పేరు వచ్చినా సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు అనేది వాస్తవం. ఆమె ప్రస్తుతం ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రానా హీరో గా నాగ చైతన్య హీరో గా ఆమె సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలు వచ్చే ఏడాది రానున్నాయి. 

 

ఇక ఆమె తమిళంలో కూడా బాగా బిజీ అయిపొయింది. అక్కడ ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి. అక్కడ ఏ సినిమాలు చేస్తుందో గాని అన్నీ కూడా స్టార్ హీరోల తోనే ఆమె చేయడం గమనార్హం. ఇక పారితోషికం విషయంలో కూడా ఆమె ఎక్కడా వెనక్కు తగ్గడం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆమె దాదాపు రెండు కోట్ల వరకు కూడా డిమాండ్ చేసే పరిస్థితి ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: