టాలీవుడ్ లో ఒక్క అవకాశం వచ్చినా సరే చాలు అనుకుంటుంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఆమె ఒక్క అవకాశం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అయినా సరే ఆమెకు అవకాశాలు రావడం ఇప్పుడు చాలా కష్టంగా మారింది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఆమె ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తుంది. అక్కడ చేసే సినిమాలు ఆమెకు పెద్దగా తీసుకు రావడం లేదు. దీనితో ఆమె టాలీవుడ్ లో అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్య్నాలు చేస్తుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఆమెకు ఎవరు అవకాశాలు ఇస్తారు అనేది మాత్రం తెలియదు గాని... 

 

ఆమెకు మాత్రం పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చినట్టు సమాచారం. క్రిష్ దర్శకత్వంలో వచ్చే సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని సమాచారం. దీని పై త్వరలోనే క్రిష్ ఒక నిర్ణయం తీసుకుంటారు అని సమాచారం. ఆమె ఎప్పటి నుంచో పవన్ సినిమాలో నటించాలి అని భావిస్తుంది. అయితే ఆమెకు అవకాశం మాత్రం రావడం లేదు. ఇక ఇప్పుడు ఆమెకు అవకాశం వచ్చింది అని తెలుస్తుంది. మరి ఆమె ఆ అవకాశాన్ని ఏ విధంగా వాడుకుంటుంది అనేది చూడాలి. పవన్ కళ్యాణ్ ని ఆమె ఒకరి ద్వారా అడిగింది అని తెలుస్తుంది. 

 

ఇక పవన్ కూడా కాదు అనలేక ఆమెను తన సినిమాలో ఎంపిక చేసారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆమె ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కూడా  లాక్ డౌన్ లో ఆగిపోయాయి. ఇక ఇది పక్కన పెడితే క్రిష్ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చే ఏడాది వచ్చే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. ఈ సినిమా కొన్ని కారణాలతో వాయిదా పడే సూచనలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. మరి ఎప్పుడు ఈ సినిమా వస్తుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: