మన తెలుగులో అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తేచుకున్న హీరోయిన్ నయనతార. అటు తమిళంలో అయినా ఇటు తెలుగులో అయినా సరే ఆమెకు మంచి పేరు ఉంది. ఆమె ఇప్పుడు దాదాపు అగ్ర హీరోలతో సినిమా చేయడమా లేక సోలో గా సినిమాలు చేయడమా అనే ఆలోచనలో మాత్రమే ఉంది అనే సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమె ఒక భారీ ప్రాజెక్ట్ కి తెలుగులో హీరోయిన్ గా కాకుండా నటిగా ఓకే చేసింది అని సమాచారం. ప్రస్తుతం దీనిపై పెద్ద చర్చలే టాలీవుడ్ లో జరుగుతున్నాయి. 

 

ఆమె ఒక హీరో కి అక్క గా నటించే ఆలోచనలో ఉందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అవును ఒక స్టార్ హీరో కి ఆమె అక్కగా నటించే సూచనలు ఉన్నాయని తెలుస్తుంది. దీనిపై త్వరలోనే స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి నిజమో కాదో తెలియదు గాని ఆమె రామ్ చరణ్ కి అక్కగా నటించే అవకాశాలు ఉన్నాయని రామ్ చరణ్ అనీల్ రావిపూడి సినిమాలో ఆమె అతనికి అక్కగా నటించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ప్రస్తుతం ఆమె తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది. 

 

ఈ సినిమల తర్వాత ఆమె తెలుగులో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉందని సమాచారం. దీని పై త్వరలోనే స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ఇది పక్కన పెడితే ఆమె  ఆచార్య సినిమాలో నటించే అవకాశం ఉందని అన్నారు గాని కొన్ని కారణాల వలన ఆమెకు కుదరలేదు. ఇప్పుడు ఆమె ఆ సినిమాలో ఒక పాత్ర చేసే అవకాశం ఉందని కూడా టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి చేస్తుందో లేదో చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాలి. లాక్ డౌన్ లో ఖాళీ గా ఉంది ఆమె.

మరింత సమాచారం తెలుసుకోండి: