టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ సినిమాలు అనగానే జనాలకు ఉండే ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే చాలు ఆయన అభిమానులు పండగ కూడా చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఆయన సినిమా విడుదల సందర్భంగా వాళ్ళు సోషల్ మీడియాలో అయినా బయట అయినా సరే ఏదోక రూపంలో తమ అభిమానం చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. 

 

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కీలక సన్నివేశాల కోసం సమయం పట్టే అవకాశం ఉంది. ఈ తరుణంలో బాలకృష్ణ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అని సమాచారం. ఆయన ఇక సినిమాల్లో హీరో పాత్రలు చేయవద్దు అని భావించినట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన ఇక తన వయసు కి తగిన విధంగానే పాత్రలను చెయ్యాలని భావిస్తున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. ఇప్పటికే తన కోసం కథలను సిద్దం చేస్తున్న దర్శక నిర్మాతలకు ఆయన ఈ విషయం చెప్పారని టాలీవుడ్ జనాలు అంటున్నారు. 

 

ఆయన వచ్చే ఏడాది నుంచి ఇక సినిమాలు చేసే అవకాశం లేదని అంటున్నారు. ఆయన ప్రస్తుత౦ ఒక సినిమా కథను విన్నారు అని దీనిని సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఆ సినిమాలో ఆయన హీరోయిన్ కి తండ్రి గా హీరో కి మావయ్య గా నటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఆయన ఏ పాత్ర చేస్తున్నారు అది ఏ విధంగా ఉంటుంది, అనేది ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి సినిమా కోసం కష్టపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: