టాలీవుడ్ లో కమర్షియల్, రొమాంటిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ కె.రాఘవేంద్రరావు అంటారు.  దర్శకేంద్రుడిగా పేరు తెచ్చుకున్న ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించడమే కాదు.. ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లుగా తీర్చి దిద్దారు. టాలీవుడ్ లో ఒక్కసారైనా దర్శకేంద్రుడితో సినిమా తీయాలనే తలపు ప్రతి హీరో, హీరోయిన్ కి ఉండేదంటే ఆయన ఎంత గొప్ప దర్శకులు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.  తెలుగు మూవీని అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన ఘనుడు.  హీరోయిన్ ను గ్లామరస్ గా చూపించడంలో కే.రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా...కమర్షియల్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్. భక్తి చిత్రాలను తీసి ప్రేక్షకులను పరవశింపజేసాడు.   టాలీవుడ్‌లో ఆయన అడుగుపెట్టి 50 ఏళ్లకు పైనే అవుతోంది. హీరోయిన్ ను తెరపై ఎంత అందంగా చూపించాలో...ఏ ఏ యాంగిల్స్ లో చూపించాలో ఆయనకు తెలిసినంతగా మరే దర్శకుడికి తెలియదు.

 

ఇక నేడు నట సార్వభౌములు నందమూరి తారక రామారావు జన్మదినం. ఈ సందర్బంగా టాలీవుడ్ ఆయనకు శ్రద్దాంజలి ఘటించింది.  అయితే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీష్ షేక్ చేశాయి. అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమలో  ఎన్టీఆర్, దర్శకుడు కే.రాఘవేంద్రరావులది సంచలన కాంబినేషన్. అడవి రాముడు సినిమాతో మొదలైన వీళ్ల కాంబినేషన్. మేజర్ చంద్రకాంత్ వరకు కొనసాగింది. మొత్తంగా వీళ్ల కాంబినేషన్‌లో 12 చిత్రాలు తెరకెక్కాయి. అందులో 10 పది సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి.

 

 ఇందులో వేటగాడు అయితే బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ అనే చెప్పొచ్చు. అప్పట్లో ఈ సినిమా ఓ ట్రెండ్ సృష్టించింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు కొద్దిగా నిరాశపరిచాయి.  మొత్తంగా వీళ్ల కాంబినేషన్‌లో 85 శాతం విజయాలున్నాయి. మొత్తంగా టాలీవుడ్‌లో ఎన్టీఆర్, కే.రాఘవేంద్రరావుది సూపర్ హిట్ కాంబినేషన్‌ అనే చెప్పాలి. ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రాఘవేంద్రరావు ఎన్టీఆర్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: