పొన్మగల్ వంధల్ అనే ఓ తమిళ కోర్టు డ్రామా చిత్రంలో న్యాయవాది పాత్రలో నటించిన హీరోయిన్ జ్యోతిక కమర్షియల్ సినిమాల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె నటించిన పొన్మగల్ వంధల్ థియేటర్లలో రిలీజ్ అవ్వకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్ ఫామ్ లో మే 29వ తేదీన అనగా రేపు విడుదల కానుంది. భారతదేశంలోనే థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఓటిటి ప్లాట్ఫామ్ పై రిలీజ్ అవుతున్న మొదటి చిత్రంగా పొన్మగల్ వంధల్ చరిత్రకెక్కనుంది. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన జ్యోతిక సినిమాలు థియేటర్లో రిలీజ్ అయితేనే బాగుంటుంది కానీ నేను నటించిన పొన్మగల్ వంధల్ చిత్రం చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మించబడినది. అందుకే ఆ చిత్రం డిజిటల్ ప్లాట్ ఫామ్ పై విడుదల చేసినా అంతగా నష్టం వాటిళ్లకపోవచ్చు. ఎంతైనా థియేటర్లో కూర్చొని సినిమా వీక్షిస్తుంటే అందరూ చప్పట్లు కొడుతూ ఈలలు వేస్తూ ఉంటే ఆ అనుభూతి వేరేలా ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రేక్షకులందరూ సర్దుకుపోవడం ఎంతైనా అవసరము', అని జ్యోతిక చెప్పుకొచ్చింది. 


తాను ఇంకా మాట్లాడుతూ... తను నటించిన పొన్మగల్ వంధల్ చిత్రం 200 దేశాల్లో రిలీజ్ కాబోతుంది అని, యూట్యూబ్ లో విడుదలైన సినిమా ట్రైలర్ కి ఇప్పటికే ఒక కోటి నలభై లక్షణాలు వీక్షణలు వచ్చాయని ఆమె తెలిపింది. ఈ చిత్రంలో ఆడపిల్లలను, చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి ఆపై హత్యలు చేయడం గురించి చూపించబడుతుంది అని కానీ ఈ చిత్రం డాక్యుమెంటరీ కాదని... సినిమా లాగానే ఉంటుందని థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని ఆమె చెప్పుకొచ్చింది. 


'మన భారతదేశంలో కమర్షియల్ సినిమాలలో ఆడవారిని తెలివి తక్కువ వారిగా చూపిస్తారు. బడా హీరోలు నటించిన చిత్రాలలో ఆడవారికి గౌరవమే లభించదు. వారి పాత్రలు ఎంత అగౌరవంగా ఉంటాయో మీరు అందరూ చూసే ఉంటారు. ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు వస్తున్నాయి కానీ అప్పట్లో ఒకటి రెండు సినిమాలు మహిళా ప్రాధాన్యతతో వచ్చినప్పటికీ ప్రేక్షకాదరణ పొందలేకపోయేవి. కమర్షియల్ సినిమాలలో ఆడవారిని బుద్ధిహీనులు గా చూపించడం నాకు అస్సలు నచ్చదు. ఆ సినిమాలో నాకు ఎన్నో పాత్రలు లభించినప్పటికీ అవన్నీ తిరస్కరించాను. నిజం చెప్పాలంటే మహిళ ప్రాధాన్యత తో తెరకెక్కే సినిమాలో మేము చాలా బాగా నటిస్తాము. ఆ సినిమాల్లో కథా బలం కూడా ఉంటుంది. హాలీవుడ్ లో లాగా మన తమిళ, తెలుగు భాషలలో కూడా కేవలం ఆడవారి నటించిన సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతే బాగుంటుంది', అని జ్యోతిక చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: