చిరంజీవిని స్టార్ హీరోగా మార్చేసిన సినిమా ఖైదీ. ఈ సినిమా తర్వాత చిరంజీవి ఇమేజ్ తో పాటు చేసే సినిమాల రూపురేఖలు మారిపోయాయి. గమనిస్తే అన్నీ యాక్షన్ సినిమాలే కనిపిస్తాయి. అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఖైదీ. ఇదే వరుసలో చిరంజీవి ఇమేజ్ ను బేస్ చేసుకుని వచ్చిన సినిమా ‘వేట’. చిరంజీవిలోని ఎనర్జీ లెవల్స్ ను ఈ సినిమా కూడా ఓ ఉదాహరణ. భారీ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమా విడుదలై నేటితో 34ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1986 మే28న విడుదలైంది. కథానుసారం హీరోను అండమాన్ నికోబార్ జైల్ కు పంపిస్తారు. ఈ నేపథ్యంలో వేసిన జైల్ సెట్ కు చాలా పేరొచ్చింది. ఆర్ట్ డైరక్టర్ తోట తరణి వేసిన ఈ జైల్ సెట్ నిజమైన జైల్ గా అనిపిస్తుంది. సెట్టింగ్ అనే భావనే రాకపోవడం విశేషం. సినిమాకు దర్శకత్వం వహించిన కోదండరామిరెడ్డి సినిమాను తన అద్భుతమైన స్క్రీన్ ప్లే, టేకింగ్ తో తెరకెక్కించారు. ఈ సినిమా తీసిన విధానం, టేకింగ్ కోదండరామిరెడ్డి కెరీర్లోనే అత్యుత్తమమైనదని పరుచూరి వెంకటేశ్వర రావు తన పరుచూరి పలుకుల్లో అభిప్రాయపడ్డారు. ఆస్థాయి టెక్నిక్ తో ఈ సినిమా తెరకెక్కించారు కోదండరామి రెడ్డి.

IHG

 

చిరంజీవితో ఖైదీ సినిమా తీసిన సంయుక్తా మూవీస్ నిర్మాతలే ఈ సినిమాను కూడా తెరకెక్కించారు. ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా భారీగా తెరకెక్కించారు. యాక్షన్ సన్నివేశాలు కూడా ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేశారు. చక్రవర్తి సంగీతంలోని పాటలు ఆకట్టుకున్నాయి. డైనమిక్ హీరోగా చిరంజీవి స్టైల్, యాక్షన్, నటన ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. జయప్రద హీరోయిన్ గా నటించింది. చిరంజీవి కెరీర్లో వచ్చిన యాక్షన్ సినిమాల్లో ఈ సినిమా కూడా ప్రత్యేకంగా నిలిచింది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: