రాజధాని అని విశాఖను తెగ వూరించేస్తున్నారు. విశాఖకు నిజానికి ఆ తహతూ అర్హతా ఉన్నా కూడా ఇంతకాలం ముసుగేసుకునే ఉంది. అయితే ఇపుడు మాత్రం ఆ అడ్డుతెరలు తొలగిపోతున్నాయి. విశాఖ రాజధాని అవుతుందని అంతా అనుకుంటున్నారు.

 

అంతకంటే ముందు సినీ రాజధానిగా విశాఖ మారుతుందని కూడా అంటున్నారు. విశాఖ సినిమా షూటింగులకు ఎపుడూ అనుకూలమే. అందువల్ల అదే జరుగుతుందని అంటున్నారు.  ఈ  విషయంలో వైసీపీ సర్కార్ వేగంగానే పావులు కదుపుతోంది.


వైసీపీ తెలివిగా వేసిన ఎత్తుగడకు టాలీవుడ్ సినీ పెద్దలు పడతారా అన్నది ఇపుడు చర్చగా ఉంది.  వ్యూహాత్మకంగా ఏపీలోని వైసీపీ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చసింది. ఏపీకి వచ్చి హ్యాపీగా  షూటింగులు చేసుకోండి అంటూ ఘనమైన ఆహ్వానం పలికింది.

 


ఇక ఏపీలో కొత్తగా వచ్చిన వైసీపీ  ప్రభుత్వానికి టాలీవుడ్ తమ సొంత రాష్ట్రానికి వస్తే బాగుంటుంది అన్న ఆలోచన ఉంది. సినిమా రంగాన్ని ఈ వైపుగా రప్పించే విషయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక శ్రధ్ధ తీసుకుంటున్నారు. టాలీవుడ్ సినీ పెద్ద చిరంజీవి తన ఇంటికి వస్తే ఎదురేగి స్వాగతం పలికిన జగన్   సినీ పరిశ్రమ తరలివస్తే ప్రభుత్వం పరంగా చేయాల్సినవన్నీ చేస్తానని హామీ ఇచ్చారు. ఆ దిశగా తగిన కార్యచరణని సిధ్ధం చేయాలని కూడా కోరారు. 


ఇపుడు మరోమారు జగన్ తన వ్యూహానికి పదును పెట్టారు. తెలంగాణా షూటింగులకు అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేయడంతో దాన్ని అందిపుచ్చుకోవాలని జగన్ వేగంగా పావులు కదిపారు. టాలీవుడ్ కి రెడ్ కార్పెట్ పరచారు. ఉచితంగా ఏపీలో ఎక్కడైనా షూటింగులు జరుపుకోవచ్చంటూ పచ్చ జెండా ఊపారు. దాంతో విశాఖ వంటి అందాల ప్రాంతాలకు సినీ కళ వస్తుందని వైసీపీ సర్కార్ భావిస్తోంది. సినీ యాక్టివిటీ పెరిగితే ఆ తరువాత దాన్ని మరింతగా పెంచి ఏపీలో సినీ పరిశ్రమ వచ్చేలా చేసుకోవచ్చునని జగన్ భావిస్తున్నారు.


విశాఖతో పాటు, భీమిలీ, ఏజెన్సీ ప్రాంతమైన అరకు, పాడేరు వంటివి సినిమా షూటింగులకు ఎంతో ఉపయోగంగా ఉంటాయి. గతంలో ఇక్కడ షూటింగులు జరిగాయి కూడా. సినిమా షూటింగులు పెద్ద ఎత్తున జరిగితే విశాఖ బ్రాండ్ ఇమేజ్ కూడా పెరుగుతుందని, తద్వారా విసాఖ రాజధానిగా మార్చేందుకు మరింత అవకాశం ఉంటుందని వైసీపీ సర్కార్ ఆలోచన చేస్తోంది. మరి టాలీవుడ్ స్పందన ఏంటన్నది చూడాలి.   

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: