మాస్ మహారాజ్ రవితేజ ఈమధ్య తన దూకుడు తగ్గించాడని చెప్పాలి. చేస్తున్న సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర సరైన సక్సెస్ అందుకోకపోవడంతో రవితేజ కెరియర్ లో చాలా వెనుకపడ్డాడు.  అంచనాలతో వచ్చిన డిస్కో రాజా కూడా డిజాస్టర్ గా మిగిలింది. ఇక ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా చేస్తున్న రవితేజ ఈ సినిమాకు క్రాక్ టైటిల్ ఫిక్స్ చేశారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 


క్రాక్ లో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ రమేష్ వర్మ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. మాస్ ఎంటర్టైనర్ గా రాబోయే ఈ సినిమాకు కిలాడి టైటిల్ పెట్టబోతున్నారట. క్రాక్,కిలాడి వరుసగా మాస్ టైటిల్స్ తో మాస్ ఆడియెన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు రవితేజ. క్రాక్ తో హిట్టు ట్రాక్ ఎక్కాలని చూస్తున్న రవితేజ సినిమా ఎక్కడ టార్గెట్ మిస్ అవకుండా జాగ్రత్త పడుతున్నారట. 


క్రాక్ పూర్తయిన తర్వాతే కిలాడి మొదలవుతుందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో కూడా రవితేజ ఒక సినిమా చేస్తాడని అంటున్నారు. మరి రవితేజ వరుస క్రేజీ సినిమాలు మాస్ రాజా ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషి చేసేలా ఉన్నాయి. క్రాక్ టీజర్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచింది. డైరక్టర్ గోపీచంద్ మలినేని కూడా ఈ సినిమాను చాలా కసితో తీస్తున్నాడని తెలుస్తుంది. మొత్తానికి క్రాక్, కిలాడి మాస్ రాజా మళ్ళీ లైన్ లో వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు అంచనాలకు తగినట్టుగా హిట్టు కొడితే ఫ్యాన్స్ పండుగ చేసుకునే అవకాశం ఉంది.               

మరింత సమాచారం తెలుసుకోండి: