బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మరో భారీ మూవీ రౌద్రం రణం రుధిరం. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను 400 కోట్ల పైన భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. 2021 జనవరి 8న సినిమా రిలీజ్ అని ఎనౌన్స్ చేసినా సరే మళ్ళీ వాయిదా పడుతుందని తెలుస్తుంది. సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను దిల్ రాజు నిజాం రైట్స్ 70 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. అయితే ప్రస్తుతం కరోనా వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడం కష్టమే అని అనుకుంటున్నారు. 

 

అందుకే ఆర్.ఆర్.ఆర్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసే ఆలోచనను మానుకుంటున్నారట దిల్ రాజు. అంతేకాదు దానయ్యకు ఇచ్చిన అడ్వాన్స్ ను కూడా తిరిగి ఇచ్చేయమని అంటున్నారట. ప్రస్తుతం షూటింగ్ క్యాన్సిల్ అవడం.. సినిమా బడ్జెట్ పెరిగిపోవడం వల్ల దానయ్య డైలమాలో పడినట్టు తెలుస్తుంది. అయితే దిల్ రాజు కాకుండా ఆర్.ఆర్.ఆర్ ను నైజాం లో అంత భారీగా ఎవరు రిలీజ్ చేస్తారన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ గా మారింది. అంతేకాదు అసలు దిల్ రాజు ఆర్.ఆర్.ఆర్ సినిమాను ఎందుకు వదులుకుంటున్నాడు..?  దిల్ రాజు అలా తొందరపడదు కదా అని కొందరు అనుకుంటున్నారు.

 

ఏది ఏమైనా దిల్ రాజు ఆర్.ఆర్.ఆర్ డిస్ట్రిబ్యూట్ చెయ్యట్లేదు అన్న వార్తా ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఈ వార్తలపై దిల్ రాజు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం దిల్ రాజు తన ప్రొడక్షన్ మీద పూర్తి దృష్టి పెట్టి డిస్టిబ్యూషన్ ను కొద్దిరోజులు దూరం పెట్టాలని చూస్తున్నారట.                               

మరింత సమాచారం తెలుసుకోండి: