స్టార్ సినిమా అనగానే వసూళ్లు  వచ్చినా రాకపోయినా సరే మొదటి రోజు, మొదటి వీకెండ్ ఇలా కోట్లకు కోట్లు వసూళ్లతో పోస్టర్స్ వేస్తారు. 2 రోజుల్లో 50 కోట్లు, 3 రోజుల్లో 100 కోట్లు ఇలా అన్నమాట. తీరా అసలు లెక్కలు చూసుకుంటే మాత్రం సినిమా జస్ట్ హిట్, లేదా ఎబో యావరేజ్ కొన్ని సినిమాలైతే వసూళ్లు బాగా వచ్చినా ప్లాప్ లిస్ట్ లో చేరుతాయి. లేటెస్ట్ గా అలాంటి సినిమా గురించి స్వయంగా ఆ సినిమా నిర్మాతలు సినిమాకు మాకు లాస్ వచ్చిందని ప్రకటించారు. 

 

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, సక్సెస్ ఫుల్ డైరక్టర్ అట్లీ కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ మూవీ బిగిల్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా 2019లో తమిళ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటని అన్నారు. సినిమాకు వసూళ్లు కూడా భారీగానే వచ్చాయి. అయినా సరే సినిమాకు 20 కోట్లు లాస్ అని తేల్చేశారు ఆ సినిమా నిర్మాతలు. ఏజిఎస్ బ్యానర్ లో తెరకెక్కిన బిగిల్ సినిమాను డైరక్టర్ అట్లీ బడ్జెట్ భారీగా పెట్టించాడట. అవసరం ఉన్నా లేకపోయినా సరే మంచి నీళ్లలా డబ్బులు ఖర్చు పెట్టించాడట. మామూలు కథకు కూడా యాక్షన్ సీన్స్ భారీగా ఉండాలని బడ్జెట్ పెంచాడని నిర్మాతలు వాపోతున్నారు. 

 

తక్కువ బడ్జెట్ లో అయితే ఈ సినిమా ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అయ్యేది కాకపోతే సినిమా బడ్జెట్ కంట్రోల్ తప్పడం వల్ల సినిమా 20 కోట్ల లాస్ తెచ్చిందని అంటున్నారు నిర్మాతలు. మార్ 2019 లో రిలీజైన తమిళ సినిమాల్లో బిగిల్ బిగ్గెస్ట్ హిట్ అని అనుకుంటుండగా సడెన్ గా ఆ సినిమా నిర్మాతలు ఇచ్చిన షాక్ కు ప్రేక్షకులు అవాక్కవుతున్నారు. బిగిల్ నిర్మాతలు చేసిన ప్రకటనకు విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఒప్పుకోవట్లేదు. కావాలనే సినిమా ప్లాప్ అని చెబుతున్నారని విమర్శిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: