తమిళం తోపాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది  రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన  కాంచన. ఇంకా చెప్పాలంటే హారర్ కామెడీ సినిమాల్లో ఈ చిత్రం కొత్త ట్రెండ్ సృష్టించింది. కాంచన స్పూర్తితో ఈ జోనర్ లో కొన్ని వందల సినిమా లు తెరకెక్కాయి.
 
ఇక ఈసినిమా ను తాజాగా హిందీలో కూడా రీమేక్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించిన లారెన్స్ ,హిందీ వెర్షన్ కి దర్శకుడు. లక్ష్మి బాంబ్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈచిత్రంలో అక్షయ్ కుమార్, కియారా అద్వానీ లీడ్ రోల్స్ లో నటించగా  తుషార్ కపూర్ , శరద్ కెల్కర్ ముఖ్యపాత్రలు పోషించారు. తుషార్ ఎంటర్టైన్మెంట్స్ ,షబీనా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. 
 
ఇక ఈచిత్రం మే లోవిడుదలకావాల్సి ఉండగా  లాక్ డౌన్ వల్ల వాయిదాపడింది. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకొనే పరిస్థితి లేదు కాబట్టి ఈసినిమా ను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తుంది. అందుకు గాను ప్రముఖ ఓటిటి సంస్థ  డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈసినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుందట. ఈహక్కుల కోసం ఎంత ఖర్చు చేసిందో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. 120 కోట్లు పెట్టి ఈ హక్కులను చేజిక్కించుకున్నట్లు  ప్రచారం జరుగుతుంది. ఈ రేంజ్ లో ఆఫర్ చేయడానికి లక్ష్మి బాంబ్ ఏమి మచ్ అవైటెడ్  మూవీ కాదు అయితే కేవలం డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కోసమే డిస్నీ ప్లస్ హాట్ స్థార్ ఈ డీల్ కు ఒప్పుకుంటుందట. ఈవార్తలపై ఇప్పటివరకు మేకర్స్ నుండి మాత్రం అధికారకంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మరి ఈచిత్రం డైరెక్ట్ గా ఓటిటి లోనే విడుదలవుతుందో లేదో తెలియాలంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: